Top Ad unit 728 × 90

బెంగళూరు గెలిచిందోచ్.. ఐపీఎల్‌లో కోహ్లీసేన బోణి

బెంగళూరు గెలిచిందోచ్.. ఐపీఎల్‌లో కోహ్లీసేన బోణి

 

ఐపీఎల్ 2019 సీజన్‌లో వరుసగా ఆరు పరాజయాల్ని చవిచూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎట్టకేలకి గెలుపు రుచి చూసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మొహాలి వేదికగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (67: 53 బంతుల్లో 8x4), ఏబీ డివిలియర్స్ (59 నాటౌట్: 38 బంతుల్లో 5x4, 2x6) అర్ధశతకాలు బాదడంతో 8 వికెట్ల తేడాతో బెంగళూరు ఘన విజయాన్ని అందుకుంది. అంతకముందు క్రిస్‌గేల్ (99 నాటౌట్: 64 బంతుల్లో 10x4, 5x6) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని బెంగళూరు మరో 4 బంతులు మిగిలి ఉండగానే 174/2తో ఛేదించింది. తాజా సీజన్‌లో ఏడో మ్యాచ్‌ ఆడిన బెంగళూరుకి ఇదే తొలి విజయం..! 


174 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ పార్థీవ్ పటేల్ (19) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్‌తో కలిసి విరాట్ కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న కోహ్లీ.. రెండో వికెట్‌కి అభేద్యంగా 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. జట్టు స్కోరు 128 వద్ద కోహ్లీ ఔటవగా.. అనంతరం జోరు అందుకున్న ఏబీ డివిలియర్స్.. ఆఖర్లో స్టాయినిస్ (28 నాటౌట్: 16 బంతుల్లో 4x4)తో కలిసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. 

అంతకముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ క్రిస్‌గేల్ కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే బాదుడు మొదలెట్టిన క్రిస్‌గేల్.. తొలి వికెట్‌కి కేఎల్ రాహుల్ (18: 15 బంతుల్లో 2x4, 1x6)తో కలిసి 66 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకి మెరుగైన ఆరంభం ఇచ్చాడు. కానీ.. దూకుడుగా ఆడే ప్రయత్నంలో రాహుల్ ఔటవగా.. అనంతరం వచ్చిన మయాంక్ అగర్వాల్ (15), సర్ఫరాజ్ ఖాన్ (15), శామ్ కరన్ (1) ఎక్కువ‌సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో.. మిడిల్ ఓవర్లలో జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించిన గేల్.. ఆఖర్లో మన్‌దీప్ సింగ్ (18 నాటౌట్: 16 బంతుల్లో 1x6)తో కలిసి మళ్లీ బ్యాట్ ఝళిపించి పంజాబ్‌కి మెరుగైన స్కోరు అందించాడు. 

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

బెంగళూరు గెలిచిందోచ్.. ఐపీఎల్‌లో కోహ్లీసేన బోణి Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *