Top Ad unit 728 × 90

రైతు బిడ్డ కోటీశ్వరుడయ్యాడు. అయితే వ్యవసాయం చేసి కాదు..

రైతు బిడ్డ కోటీశ్వరుడయ్యాడు. అయితే వ్యవసాయం చేసి కాదు..

రైతు బిడ్డ కోటీశ్వరుడయ్యాడు. అయితే వ్యవసాయం చేసి కాదు.. కబడ్డీ కూతతో ప్రత్యర్థులను హడలెత్తించి. ఏడాది కిందటి వరకు ఎవరికీ తెలియని సిద్దార్థ్‌ దేశాయ్‌ పేరు ఇటీవల జరిగిన ప్రొ కబడ్డీ వేలంతో మార్మోగుతోంది. అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలోనే రైడింగ్‌ పాయింట్లలో డబుల్‌ సెంచరీ కొట్టిన ఆ స్టార్‌ ఆటగాడు తాజాగా జరిగిన వేలంలో అత్యధికంగా రూ. 1.45 కోట్ల ధర పలికి శభాష్‌ అనిపించాడు. తెలుగు టైటాన్స్‌కు టైటిల్‌ అందించడంతో పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే తన టార్గెట్‌ అంటున్నాడీ

కబడ్డీ కరోడ్‌పతి.

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లా పూలేవాడి పట్టణం సిద్ధార్థ్‌ స్వస్థలం. రైతు బిడ్డయిన సిద్ధార్థ్‌ ఆరేళ్ల వయస్సులో కబడ్డీ ఆడడం ప్రారంభించాడు. ఆటలో సిద్ధార్థ్‌కు తొలి గురువు అతని సోదరుడు సూరజ్‌. అన్నదమ్ములిద్ద రూ ఒకేజట్టు తరఫున కబడ్డీ ఆడుతున్నారంటే ప్రత్యర్థి టీమ్‌ ఓటమని అనుకోవాల్సిందే. ఇలా బాల్యంనుంచే కబడ్డీలో తమ ప్రత్యేకతను చాటు కున్న ఈ ఇద్దరు కళాశాలస్థాయికి చేరుకునేసరికి కోచ్‌ అశోక్‌ షిండే దృష్టి లో పడ్డారు. షిండే శిక్షణలో సోదరులిద్దరూ అనతికాలంలోనే రాటు దేలారు. సూరజ్‌ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) తొలి సీజన్‌లో జైపూర్‌ తరఫున ఆడి అదరగొట్టాడు. ఆర్మీలో పనిచేస్తున్న సూరజ్‌కు ఆ తర్వాతి సీజన్లలో ఆడేందుకు ఉన్నతాధికారులు అనుమతివ్వలేదు. ఇక, ఐదో సీజన్‌లో దబాం గ్‌ ఢిల్లీ తరఫున బరిలోకి దిగినా గాయం కారణంగా లీగ్‌ మధ్యలో తప్పు కొన్నాడు. ఇక, అప్పటివరకు కబడ్డీని కేవలం అభిమాన క్రీడగానే భావించిన సిద్ధార్థ్‌ అన్న సూరజ్‌ ప్రేరణతో కెరీర్‌గా ఎంచుకున్నాడు.

మలుపుతిప్పిన హైదరాబాద్‌

అంతవరకు స్థానికంగా జరిగే టోర్నమెంట్లలో అందరితో శభాష్‌ అనిపిం చుకోవడమే గొప్పగా భావించిన సిద్ధార్థ్‌.. తాను కూడా ఒక స్టార్‌ కావాలని తలచాడు. ముందు మహారాష్ట్ర జట్టులో చోటు సంపాదించి జాతీయ స్థాయి పోటీల్లో ఆడాలని లక్ష్యం నిర్దేశించుకొని శ్రమించాడు. అద్భుతమైన ప్రతిభతో స్వల్ప వ్యవధిలోనే టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. రెండేళ్ల కిందట హైదరాబాద్‌లో జరిగిన జాతీయ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో మహా రాష్ట్రను విజేతగా నిలిపి సత్తాచాటాడు. ఈ టోర్నీలో సిద్ధార్థ్‌ ప్రతిభను గుర్తించిన పీకేఎల్‌ యజమాన్యం గతేడాది వేలంలో అతడిని అందు బాటులో ఉంచింది. యు ముంబా రూ. 36.40 లక్షలకు కొనుగోలు చేసింది.

రికార్డుల మోత

పీకేఎల్‌లో అత్యంత వేగంగా 50 రైడ్‌ పాయింట్లు సాధించిన రికార్డును సిద్ధార్థ్‌ సొంతం చేసుకున్నాడు. అలాగే వేగంగా 100 రైడ్‌ పాయింట్లు సాధించిన రాహుల్‌ చౌధురి రికార్డును కూడా సమం చేశాడు. గత సీజన్‌లో మొత్తం 221 పాయుంట్లు (218 రైడ్‌, 3 టాకిల్‌) సంపాదించి అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. దీంతో తాజా సీజన్‌లో సిద్ధార్థ్‌కు ఊహించని విధంగా డిమాండ్‌ పెరిగింది. అతడి బేస్‌ ధర రూ. 30 లక్షలు కాగా తెలుగు టైటాన్స్‌ కోటి రూపాయలతో వేలం ప్రారంభించి అందరినీ విస్మయపరిచింది. తీవ్రమైన పోటీని ఎదుర్కొని సిద్ధార్థ్‌ను రూ. 1.45 కోట్లకు దక్కించుకొంది. పీకేఎల్‌ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా మోను గోయత్‌ గత ఏడాది రూ.1.51 కోట్లు ధర పలకగా ఈ జాబితాలో రెండో ఖరీదైన ఆటగాడిగా సిద్ధార్థ్‌ ఈ ఏడాది స్థానం సంపాదించాడు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

రైతు బిడ్డ కోటీశ్వరుడయ్యాడు. అయితే వ్యవసాయం చేసి కాదు.. Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *