Top Ad unit 728 × 90

టీమ్‌ఇండియా బౌలర్ దీపక్‌ ఏకంగా 88 స్థానాలు పైకి

టీమ్‌ఇండియా బౌలర్ దీపక్‌  ఏకంగా 88 స్థానాలు పైకి 

టీమ్‌ఇండియా బౌలర్ దీపక్‌ చాహర్‌ ఐసీసీ టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 88 స్థానాలు ఎగబాకాడు. నాగ్‌పుర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన నిర్ణయాత్మక టీ20లో ఆరు వికెట్లతో చెలరేగిన అతడు 42వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సాధించిన అతడు టీ20 చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు (3.2-0-7-6) నమోదు చేశాడు. అంతేకాకుండా భారత్ తరఫున పొట్టిఫార్మాట్‌లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి బౌలర్‌గానూ రికార్డు సృష్టించాడు. అఫ్గానిస్థాన్‌ బౌలర్ రషీద్‌ ఖాన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్‌-10 బౌలర్లలో ఎనిమిది మంది స్పిన్నర్లే ఉండటం గమనార్హం.

నాగ్‌పుర్ టీ20లో అర్ధశతకంతో విజయంలో తన వంతు పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ (52) ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి ఏడో స్థానంలో రోహిత్‌శర్మ, 12వ స్థానంలో శిఖర్‌ ధావన్‌, 15వ స్థానంలో విరాట్‌ కోహ్లీ ఉన్నారు. అగ్రస్థానంలో పాక్‌ సారథి బాబర్ అజామ్‌ కొనసాగుతున్నాడు. ఆసీస్‌ సారథి ఫించ్‌, ఇంగ్లాండ్‌ ఆటగాడు డేవిడ్‌ మలన్‌ రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్ (260) ఐదో స్థానంలో నిలిచింది. టీమ్‌ఇండియా కంటే ముందు పాకిస్థాన్‌ (270), ఆస్ట్రేలియా (269), ఇంగ్లాండ్ (265), దక్షిణాఫ్రికా (262) ఉన్నాయి.

టీమ్‌ఇండియా బౌలర్ దీపక్‌ ఏకంగా 88 స్థానాలు పైకి Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *