Top Ad unit 728 × 90

ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్..

ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్..

ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన కస్టమర్లకు శుభవార్త అందించింది. బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్న వారిపై వడ్డీ తగ్గనుంది. బ్యాంకు రుణ రేట్లలో కోత విధించింది. ఎంసీఎల్‌ఆర్ రేటును 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. రుణ రేట్ల తగ్గింపు ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది. ఏడాది కాలపు రుణాలపై సవరించిన ఎంసీఎల్‌ఆర్ రేటు 8.50 శాతంగా ఉంది. ఇది ఇంతకు ముందు 8.55 శాతం.

బ్యాంక్ అలాగే గృహ రుణాలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. రూ.30 లక్షల వరకు ఉన్న రుణాలకే ఇది వర్తిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 4న రేపో రేటు కూడా తగ్గించింది. దీంతో రేపో రేటు 6 శాతానికి దిగి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం హె‌చ్‌డీఎఫ్‌సీ ఎంసీఎల్‌ఆర్ రేటు తగ్గించింది. ఇప్పుడు ఎస్‌బీఐ అదే బాటలో పయనిస్తోంది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *