Top Ad unit 728 × 90

పవన్ కళ్యాణ్ సినిమాలకు ఒకే చెప్పుతున్నాడా ...! నమ్మలేని నిజాలు

పవన్ కళ్యాణ్ సినిమాలకు ఒకే చెప్పుతున్నాడా ...! నమ్మలేని నిజాలు

జనసేన స్థాపించి ఈ ఎన్నికల్లో బరిలో దిగిన పవన్‌ కళ్యాణ్‌ ఈ ఎన్నికల్లో ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తాడోనని అందరూ చర్చించుకుంటున్నారు. అందుకే పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ సినిమాలు చేసుకోవాలని భావిస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, పవన్‌ జనసేన పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లను దక్కించుకుంటుందనే విషయంపై క్లారిటీ లేదు. అసలు అర్థం కాని పరిస్థితి నెలకొనడంతో ఫలితం ఎలా ఉంటుంది, ఏం జరుగుతుందా అంటూ పవన్‌ ఫ్యాన్స్‌ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. పవన్‌ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒకటి గెలుస్తాడని, మరెక్కడ కూడా జనసేన పార్టీ కనీసం రెండవ స్థానంలో కూడా కష్టమేనని తలపండిన రాజకీయ నాయకులు కొందరు గట్టిగా చెబుతున్నారు.

మొత్తం మీద పవన్‌ ఈ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేక పోయాడు అనేది చాలా మంది చెబుతున్న మాట. ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో ఏపీ వారు ఉండటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏపీ వారు హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకోడానికి సినిమాలు చేయడానికి అక్కడ వారికి భయపడుతూ ఉండాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్‌ కళ్యాణ్‌ మూడు రోజుల క్రితం హైదరబాద్‌ చేరుకొని, తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ గత కొన్ని రోజులుగా పెంచిన గడ్డంను తొలగించి క్లీన్‌ షేవ్‌తో ఉన్నాడట. ఇటీవల ఇద్దరు ముగ్గురు రచయితలు ఆయనకు కథలు వినిపించారని కూడా టాక్. పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఇదే ఏడాది వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ మూవీ కూడా ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి.

ఎన్నికల ఫలితాలను బట్టి పవన్‌ కళ్యాణ్‌ సినిమా చేసే అవకాశం ఉందంటున్నారు. జనసేనకు ప్రజలు జై కొట్టకుంటే ఖచ్చితంగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు చేస్తాడు. అయితే పాతిక సీట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రం ఖచ్చితంగా సినిమాలకు గుడ్‌ బై చెప్తాడని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు అనధికారికంగా వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లో రాణించకుంటే సినిమాల్లోకి రావడం ఖాయం అనేది తేలిపోయింది. ఇక ఎందుకు ఆలస్యం అన్నట్లు ముందే కథలు వింటుండటం కూడా పవన్‌ ఫలితాలపై ఒక క్లారిటీకి వచ్చాడని అంటున్నారు. చూద్దాం మే 23న ఫలితాలు ఎలా వుంటాయో.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

పవన్ కళ్యాణ్ సినిమాలకు ఒకే చెప్పుతున్నాడా ...! నమ్మలేని నిజాలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *