Top Ad unit 728 × 90

హైదరాబాద్ లో మరో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ప్రమాదం...

హైదరాబాద్ లో మరో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ప్రమాదం...

హైదరాబాద్ నగరంలో మరో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ప్రమాదం చోటుచేసుకుంది . జూబ్లీహిల్స్‌ ఫిల్మ్‌నగర్‌లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విశ్వజిత్‌ అనే యువకుడు అక్కడిక్కడే మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మణికొండలో ఓ గెట్‌ టూ గెదర్‌ పార్టీకి వెళ్లి వస్తుండగా ప్రమాదం సంభవించింది. విశ్వజిత్‌ మృతదేహాన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారికి కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మద్యం తాగి వాహనాన్ని నడపడం వల్లే రోడ్డు ప్రమాదానికి కారణం అని భావిస్తున్నారు.

మద్యం మత్తులో ఫిల్మ్‌నగర్‌లోని ఓ చిన్న రోడ్డులో అతివేగంగా కారు నడపడంతో అదుపుతప్పిన కారు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొ‍ట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న వారిలో విశ్వజిత్‌ అక్కడిక్కడే మృతి  చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటలో కారు పూర్తిగా ధ్వంసమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్ లో మరో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ప్రమాదం... Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *