Top Ad unit 728 × 90

నువ్వేమి చేశావు 'నేరం'... 'భగవాన్'కూ తప్పని రూ.1.4 లక్షల చలానా!

నువ్వేమి చేశావు 'నేరం'... 'భగవాన్'కూ తప్పని రూ.1.4 లక్షల చలానా!

న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలు చేయడంతో వాహనాలపై పడుతున్న భారీ చలానాల అంశం చర్చనీయాంశంగా మారింది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్న వాహనదారులు భారీగా జరిమానాలు కట్టవలసివస్తోంది. కొంతమందికి రూ. 10 వేలు వడ్డిస్తుంటే. మరికొందరికి రూ.25 వేల వరకూ జరిమానా విధిస్తున్నారు. అయితే ఇప్పుడు అత్యధికంగా లక్ష రూపాయలకు మించి జరిమానా వడ్డించిన ఉదంతం వార్తల్లో నిలిచింది. రాజస్థాన్‌కు చెందిన ఒక ట్రక్కు యజమానికి రూ. 1.40 లక్షల రూపాయల జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే ఇటీవల అతని ట్రక్కు ఓవర్ లోడింగ్‌తో వెళుతుండగా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. తరువాత రోహిణి కోర్టు ఆ ట్రక్కు యజమానికి రూ. 1,41,700 మేరకు జరిమానా విధించింది. ఆ ట్రక్కు యజమాని పేరు భగవాన్ రామ్ అని తెలుస్తోంది. గతంలోనూ ఒక ట్రక్కు యజమానికి రూ. 1.16 లక్షల చలానా వడ్డించారు. పలు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కింద ఈ విధంగా చలానా విధించారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

నువ్వేమి చేశావు 'నేరం'... 'భగవాన్'కూ తప్పని రూ.1.4 లక్షల చలానా! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *