Top Ad unit 728 × 90

దౌత్య పద్ధతిలో ఆర్టికల్‌ 370 వివాద పరిష్కారం...!

దౌత్య పద్ధతిలో ఆర్టికల్‌ 370 వివాద పరిష్కారం...!

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసిన భారత ప్రభుత్వ చర్యపై బ్రిటన్‌ ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. తమ దేశంలోని ఈ రెండు దేశాలకు చెందిన ప్రజల నుండి ఈ వివాదంపై అందిన వినతులకు స్పందించిన బ్రిటన్‌ ప్రభుత్వం దౌత్య పద్ధతిలో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకూ సూచించింది. ఈ వివాదంపై అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల తరహాలో స్థిర మైన వైఖరిని అనుసరించటానికి బదులు బ్రిటన్‌ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో జరిపిన సంభాషణలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వివాదంలో జోక్యం చేసుకుని తగు న్యాయం చేయాలంటూ భారత సంతతికి చెందిన 15 లక్షల మంది ప్రజలు, పాక్‌ సంతతికి చెందిన 14 లక్షల మంది ప్రజలు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు వినతిపత్రాలను పంపారు. భారత్‌తో వాణిజ్య సంబంధాల విషయంలో చర్చిస్తున్న ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్‌ ప్రజల తరపున కూడా మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. బ్రెగ్జిట్‌ తరువాత భారత్‌తో వాణిజ్య సంబంధాల బలోపేతంపై ప్రధాని జాన్సన్‌ భారత ప్రభుత్వంతో చర్చించిన విషయం తెలిసిందే. అయితే భారత అంతర్గత వ్యవహారమైన ఈ విషయంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ కన్జర్వేటివ్‌ ఎంపి బాబ్‌ బ్లాక్‌మన్‌ ప్రధాని జాన్సన్‌కు రాసిన లేఖలో ఆరోపించారు.

ఎంపిలతోపాటు లేబర్‌ పార్టీకి చెందిన షాడో విదేశాంగ మంత్రి లిజ మెకిన్స్‌ కూడా భారత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌ విషయంలో చేపట్టిన మార్పులపై తీవ్రంగా విమర్శించారు. అయితే పాలక కన్జర్వేటివ్‌ పార్టీ మాత్రం దీనిపై ఎటూ స్పందించలేదు. ఇదిలా వుండగా జమ్మూ కాశ్మీర్‌ పరిణామాలపై ఇక్కడి భారత దౌత్య కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో భారీయెత్తున నిరసన ప్రదర్శనలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

దౌత్య పద్ధతిలో ఆర్టికల్‌ 370 వివాద పరిష్కారం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *