Top Ad unit 728 × 90

బెంగాల్‌ కంటే జమ్మూకశ్మీరే మెరుగు: మోదీ

బెంగాల్‌ కంటే జమ్మూకశ్మీరే మెరుగు: మోదీ

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ తాజా విమర్శలు గుప్పించారు. పశ్చిమబెంగాల్‌లో కంటే జమ్మూకశ్మీర్‌లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని అన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవాళ్లు, తటస్థంగా వ్యవహరించే వాళ్లు బెంగాల్ హింసాకాండపై మౌనముద్ర దాల్చడం మరింత బాధాకరమని 'న్యూస్-18'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోదీ పేర్కొన్నారు.

కోల్‌కతాలో అమిత్‌షా మంగళవారం జరిగిన రోడ్‌షో సందర్భంగా చెలరేగిన హింసాకాండ అనంతరం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌ను తృణమూల్ కాంగ్రెస్ కలిసేందుకు సిద్ధమవుతుండగా, పశ్చిమబెంగాల్‌లో రాజ్యాంగ యంత్రాంగ వైఫల్యం కారణంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించాలని బీజేపీ ప్రతినిధి బృందం ఈసీని కోరింది.

పశ్చిమబెంగాల్‌లో పరిస్థితిని జమ్మూకశ్మీర్‌తో పోల్చిన మోదీ... జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు బెంగాల్ కంటే ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. 'కశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు ఒక్క పోలింగ్ బూత్‌లోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. అదే సమయంలో జరిగిన బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో పలువురు వ్యక్తులు హతమయ్యారు. గెలిచిన కొందరి ఇళ్లు తగులబెట్టి, జార్ఖండ్, ఇతర రాష్ట్రాలకు వాళ్లను పారిపోయేలా చేశారు. వాళ్లు తప్పిదమల్లా ఎన్నికల్లో గెలవడమే' అని మోదీ చెప్పారు. బీజేపీ, వామపక్షాలతో పాటు కాంగ్రెస్ సైతం ఈ అంశాన్ని లేవనెత్తినప్పటికీ, తటస్థంగా ఉన్నామని చెప్పుకున్న వాళ్లు మాత్రం మౌనంగా ఉండిపోయారని, చివరకు బీజేపీ ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ను కూడా బెంగాల్‌లోకి అనుమతించలేదని, బీజేపీ ర్యాలీలను కూడా అనుమతి ఇవ్వడం లేదని మోదీ పేర్కొన్నారు. బీజేపీకి, లెఫ్ట్‌కి లేదా కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ బయపడుతుండటమే ఇందుకు కారణమని ప్రధాని విమర్శించారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

బెంగాల్‌ కంటే జమ్మూకశ్మీరే మెరుగు: మోదీ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *