Top Ad unit 728 × 90

ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక భేటీ!

ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక భేటీ!

ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఈ కీలక సమావేశంలో రాష్ట్రంలో పార్టీని మరింతగా బలోపేతం చేసే అంశంపై సోనియాగాంధీ కీలక సూచనలు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు కొందరు బీజేపీతో చేతులు కలిపి సంకీర్ణ ప్ర భుత్వాన్ని పడగొట్టినప్పటి నుంచి సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేపీసీసీకి నూతన అధ్యక్షుడి, పదాదికారుల నియామకం, అన్ని జిల్లాలకు నూతన అధ్యక్షులు, శాసనసభ, విధానపరిషత్‌లో ప్రతిపక్షనేతల ఎంపిక ఇత్యాది అంశాలపై కూడా సోనియాగాంధీతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సమాలోచనలు జరిపే అవకాశం ఉంది. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షస్థానం కోసం తీవ్ర పోటీ నెలకొని ఉన్న నేపథ్యంలో సోనియాగాంధీ నిర్ణయమే కీలకంగా మారింది. పార్టీకి అత్యంత విధేయుడిగా ఉన్న ప్రముఖ లింగాయత నేత హెచ్‌కేపాటిల్‌ వైపే కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రతిపక్షనేత పదవికి పరిశీలిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. మాజీ ఉపముఖ్యమంత్రి డీజీ పరమేశ్వర్‌, మాజీ మంత్రి ఆర్‌వీ దేశ్‌పాండేలు కూడా ప్రతిపక్ష నేత పదవికోసం గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ పార్టీకి పలు కారణాలతో దూరమైన లింగాయతులను మళ్లీ ఆకర్షించేందుకు పాటిల్‌కే పగ్గాలు అప్పగించాలని 20మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానం పెద్దలను కోరినట్టు తెలుస్తోంది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక భేటీ! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *