Top Ad unit 728 × 90

రైతులకు ఏడాదికి రూ.6 వేలు అమలు చాలా కష్టం

 

రైతులకు ఏడాదికి రూ.6 వేలు అమలు చాలా కష్టం...!

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మోదీ సర్కార్ రైతు బంధు తరహాలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలుసు కదా. మొన్న బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక మంత్రి ఈ పథకాన్ని ప్రకటించారు. అయితే దీని అమలు మాత్రం అంత సులువు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తామని, అందులో తొలి విడత రూ.2 వేలు ఈ ఏడాదే ఇస్తామనీ పియూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ఉపయోగపడనుంది. దీని అమలుకు రూ.75 వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు. అయితే ఈ రూ.6 వేలు సరిపోతాయా లేదా అన్నది పక్కన పెడితే... దీని అమలు మాత్రం చాలా కష్టం. దీనికి న్యాయపరమైన చిక్కులు తప్పవు.

భూయాజమాన్య హక్కులపై ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పథకం అమలుకు అడ్డంకిగా మారవచ్చు అని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ఎన్‌కే పొద్దార్ అన్నారు. రూ.75 వేల కోట్ల మొత్తం ఇలా పంచితే వృథాగా పోయినట్లే అని జాదవ్‌పూర్ యూనివర్సిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ సైకత్ సిన్హా రాయ్ అభిప్రాయపడ్డారు. ఇదే మొత్తాన్ని పెట్టుబడి సాయంగా లేదా మంచి ధరలు కల్పించడానికి ఉపయోగించవచ్చని, దీని ద్వారా ఆర్థిక లబ్ధి పొందే అవకాశం ఉండేదని ఆయన చెప్పారు.

దీని కారణంగా ఒక భూమికి ఒకరి కంటే ఎక్కువ మంది యజమానులు ఉంటే ఆ భూమికి సంబంధించి ఎక్కువ మందికి ఆర్థిక సాయం చేయాల్సిన పరిస్థితి కలుగుతుందని రాయ్ తెలిపారు. టైటిల్ డీడ్‌లో ఒకరి పేరున్నంత మాత్రాన ఆ భూమిపై యాజమాన్య హక్కులు అతనికే దక్కవని, న్యాయపరమైన పోరాటంలో ఇతరులు కూడా యాజమాన్య హక్కుల కోసం పోరాడవచ్చని ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ లెక్కన ఒక భూమికి ఒకరి కంటే ఎక్కువ మంది యజమానులు ఉంటే... అందరూ ఆ రూ.6 వేల సాయం అందుకుంటారని పొద్దార్ చెప్పారు. అందువల్ల మొదటి విడత సాయం రూ.2 వేలు ఇవ్వడం కూడా ఓ సవాలే అని పొద్దార్ స్పష్టం చేశారు.

గమనిక:- వీడియోల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

రైతులకు ఏడాదికి రూ.6 వేలు అమలు చాలా కష్టం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *