Top Ad unit 728 × 90

దావూద్ తాట తీయండి... UNSCని కోరిన భారత్

దావూద్ తాట తీయండి... UNSCని కోరిన భారత్

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం,అతని నెట్ వర్క్ పై సమిష్టి అంతర్జాతీయ చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)ని భారత్ కోరింది. గోల్డ్ స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ ద్వారా దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, లెవాంట్ (ISIL)లపై తీసుకున్న చర్యల తరహాలో దావూద్,అతని నెట్ వర్క్ పై చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది.

మంగళవారం(జులై-9,2019)"అంతర్జాతీయ భద్రత, శాంతికి ముప్పు" అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఐక్యరాజ్యసమితిలో భారతదేశపు శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ దావూద్ ఇబ్రహీంకు చెందిన క్రిమినల్ సిండికేట్టె ర్రరిస్ట్ నెట్‌వర్క్‌(డీ కంపెనీ)గా రూపాంతరం చెందిందని అన్నారు. డీ-కంపెనీతోపాటు నిషేధిత జైషే మహమ్మద్, లష్కరే తాయిబా తదితర ఉగ్రవాద సంస్థల నుంచి భారత్‌కు ముప్పు ఉన్న కారణంగా వాటిని కట్టడి చేసేందుకు ఐరాస భద్రతా మండలి దృష్టిసారించాలన్నారు. దావూద్ తమ దేశంలోనే ఉన్నాడని ఒప్పుకునేందుకు నిరాకరిస్తున్న స్వర్గధామం (పాకిస్తాన్) నుంచి అతడు ఈ నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అని తెలిపారు.

ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అండర్‌ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే ఉన్నాడని అమెరికా ప్రభుత్వం ఇటీవల లండన్ వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టుకి తెలిపింది. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ కేంద్రంగా దావూద్ ఉగ్ర కార్యకలాపాలు, డీ-కంపెనీ వ్యవహారాలు జరుగుతున్నాయని అమెరికా తెలిపింది.

దావూద్ సన్నిహితుడు, వివిధ నేరాల్లో పాల్గొని ఇంగ్లాండ్ జైలులో ఉన్న జబీర్ మోతివాలాను అప్పగించాలని కోరుతూ అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై లండన్ స్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టులో ఇటీవల విచారణ సందర్భంగా దావూద్ ఇబ్రహీం 1993 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్ నుంచి పారిపోయాడని, ప్రస్తుతం పాకిస్తాన్‌లోని ఓ గుర్తుతెలియని ప్రాంతంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని అమెరికా కోర్టుకి తెలిపింది. అయితే దావుద్ ఇబ్రహీం తమ దేశంలో లేడంటూ ఏళ్లుగా పాక్ బుకాయిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

దావూద్ తాట తీయండి... UNSCని కోరిన భారత్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *