Top Ad unit 728 × 90

త్వరలో అందరికి సరికొత్త స్మార్ట్ ఓటర్ కార్డు...!

త్వరలో అందరికి సరికొత్త స్మార్ట్ ఓటర్ కార్డు...! 

స్మార్ట్ ఓటర్ కార్డులో ఉండే ఫీచర్లేంటో తెలుసా? ప్లాస్టిక్ తో తయారు చేసే ఈ కార్డులో చాలా లేయర్లు ఉంటాయి. అంటే ఈ కార్డును డుప్లికేట్ చేయలేం. ఈసీ హోలోగ్రామ్ ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి కార్డుపై యూనిక్ బార్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్ ద్వారా ఓటర్ కు సంబంధించిన బేసిక్ డిటెయిల్స్ అంటే పేరు, అడ్రస్, పుట్టినతేదీ లాంటి వాటిని భవిష్యత్తులో స్టోర్ చేయడం కోసం ఈసీ సిద్ధమవుతోంది. భవిష్యత్తులో ఈ కార్డు బార్ కోడ్ ఉపయోగించి ఓటర్ కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకునే వెసులుబాటును ఈసీ కల్పించనుంది. 
ప్రస్తుతానికి ఈ కార్డు ధరను 30 రూపాయిలుగా నిర్ణయించారు. కానీ, త్వరలోనే కార్డు ధరను ఇంకాస్త తగ్గించడానికి ప్రయత్నిస్తారట. 18 ఏళ్లు నిండి కొత్తగా ఓటర్ ఐడీ కార్డు కోసం అప్లయి చేసుకున్న వాళ్లకు ఈ సరికొత్త స్మార్ట్ ఓటర్ ఐడీనే అందిస్తారు. వాళ్లకు వచ్చే సంవత్సరం జనవరి 25 వరకు కొత్త కార్డులు అందుతాయి. ఆ కార్డుపై ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ డిజిటల్ సంతకం కూడా ఉంటుంది. ఇప్పటికే బ్లాక్ అండ్ వైట్ ఓటర్ కార్డు ఉన్నవాళ్లు కొత్త ఫీచర్లతో వచ్చే ఎపిక్ కార్డు కావాలనుకుంటే... ఈసీ వెబ్ సైట్ లో అప్లయి చేసుకోవచ్చు. కనీసం 15 రోజుల సమయంలో కొత్త ఎపిక్ కార్డును ఈసీ ఇంటికి పంపిస్తుంది.

 

 

త్వరలో అందరికి సరికొత్త స్మార్ట్ ఓటర్ కార్డు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *