నెలకి 30 వేలు... కేంద్రం నుంచి బంపర్ ఆఫర్
నెలకి 30 వేలు... కేంద్రం నుంచి బంపర్ ఆఫర్, ఎలా అప్లై చేసుకోవాలంటే...?
కేంద్ర ప్రభుత్వం పేద వారి కోసం ఎప్పటికప్పుడు ఎన్నో పథకాలని ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పేరుతో ఓ స్కీమ్ ను అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ఆరోగ్య సేవలు పొందే అవకాశం ఉంటుంది.
ఈ పథకంకి దరఖాస్తు చేసుకున్న వాళ్లకు కేంద్రం నుంచి గోల్డెన్ కార్డ్ పొందే అవకాశాలు ఉంటాయి.
ఆయుష్మాన్ మిత్ర రిజిస్ట్రేషన్ ద్వారా నెలకు రూ.30000 దాకా పొందే అవకాశం ఉంది. పేదవారికి ఉచితంగా వైద్య సేవలను అందిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తుంది. ఆయుష్మాన్ మిత్ర పోస్టులకు దరఖాస్తు చేయడానికి మీరు 12వ తరగతి పాసై ఉండాలి. అలాగే 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఇంకా దీనితో పాటు సాధారణ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. స్థానిక భాష ఇంకా హిందీ లేదా ఇంగ్లీషులో పరిజ్ఞానం ఉండాలి.ప్రభుత్వం ఉద్దేశ్యం ఏంటంటే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రోత్సహించాలి, ఆసుపత్రి విధానాలు, ఆయుష్మాన్ కార్డులను రూపొందించడానికి పేద ప్రజలకు సహాయపడాలి. IDని QR కోడ్ ద్వారా వెరిఫై చెయ్యాలి. అలాగే దానితో పాటు డేటాను బీమా ఏజెన్సీలకు పంపాలి.వ్రాతపూర్వక అసైన్‌మెంట్‌లను నిర్వహించి ఆధార్‌తో డేటా వెరిఫికేషన్ చేసి వివిధ పనులని చేయాలి.
దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే.. అధికారిక వెబ్‌సైట్ https://pmjay.gov.in/కి వెళ్ళి మెయిన్ పేజీలో మీరు రిజిస్టర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి అప్లై బటన్‌పై క్లిక్ చేయండి. అప్పుడు OTP మొబైల్‌కి పంపబడుతుంది. దాన్ని ఎంటర్ చేసి కొనసాగించండి. తరువాత రిజిస్ట్రేషన్‌లో నింపాల్సిన వివరాలు ఇంకా అవసరమైన పత్రాలను అటాచ్ చేయండి. అది పూర్తయిన తర్వాత సబ్‌మిట్ చేసి లాగిన్ ఐడి పాస్‌వర్డ్‌ను పొందుతారు. దానిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తరువాత ఆయుష్మాన్ మిత్ర పోర్టల్‌కి వెళ్ళి అధికారిక వెబ్‌సైట్ https://pmjay.gov.in/ని సందర్శించి, హోమ్ పేజీలో రిజిస్టర్ ఆప్షన్ ఎంచుకోండి. తరువాత ఆయుష్మాన్ మిత్ర లాగిన్ ఆప్షన్ ఎంచుకోండి. మీ మొబైల్ నంబర్ ఇంకా క్యాప్చా కోడ్‌ను నమోదు చేశాకా Generate OTPపై క్లిక్ చేసి లాగిన్ చేయడానికి మీ మొబైల్‌లో వచ్చిన OTPని ఎంటర్ చేయండి.దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.