Top Ad unit 728 × 90

మటన్ సూప్ లో సైనడ్ కలిపి ఆస్తికోసం 6 గురిని అంతం చేసింది...!

మటన్ సూప్ లో సైనడ్ కలిపి ఆస్తికోసం 6 గురిని అంతం చేసింది...! 

కేరళలో సంచలనం రేపిన హత్యల మిస్టరీ వీడింది. 14 ఏళ్లలో ఆరుగురు కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. వారందరిని మర్డర్ చేసింది కుటుంబసభ్యురాలే. పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగుచూసింది. పోస్టుమార్టం నివేదిక మర్డర్ మిస్టరీని చేధించింది. ఆస్తి కోసం కుటుంబసభ్యులను చంపేసింది. 14 ఏళ్లుగా కుటుంబంలోని ఒక్కొక్కరిని మర్డర్ చేస్తూ వచ్చింది. మటన్ సూప్ లో సైనెడ్ కలిపి వారందరిని కడతేర్చింది.

వివరాల్లోకి వెళితే... కోజికోడ్ జిల్లా కూడథాయ్ గ్రామంలో ఓ క్యాథలిక్ ఫ్యామిలీలో ఆరుగురు హత్యకు గురయ్యారు. 2002 నుంచి 2016 వరకు కుటుంబంలోని ఒక్కొక్కరు చనిపోయారు. ఆస్తి కోసం జాలీజోసెఫ్(47) కుటుంబసభ్యులను హతమార్చింది. భర్త సోదరుడు షాజుపై మనసు పడిన ఆమె.. ఈ దారుణానికి ఒడిగట్టింది. ఆస్తి మీద కన్నేసిన జాలీ, షాజు సాయంతో కుటుంబసభ్యలను పక్కా స్కెచ్ ప్రకారం మర్డర్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. 14 ఏళ్లుగా కుటుంబంలోని ఒక్కొక్కరిని చంపుతూ వచ్చిందని పోలీసులు వెల్లడించారు.

2002లో అత్త అన్నమ్మ థామస్(57), 2008లో మామ టామ్ థామస్(66) చనిపోయారు. 2011లో భర్త రాయ్ థామస్(40) ను సైతం హత్య చేసింది జాలీ. 2014లో అన్నమ్మ సోదరుడు మ్యాథ్యూ(67) చనిపోయారు. 2016లో అల్ఫోన్సా(2), ఆ తర్వాత ఆమె తల్లి సిలీ(27) చనిపోయారు. వారందరివి సహజ మరణాలే అని జాలీ జోసెఫ్ .. కుటుంబసభ్యులను, స్థానికులను నమ్మించింది. ఎవరికీ ఎలాంటి అనుమానాలు రాకుండా డీల్ చేసింది. అందరి మృతదేహాలను గుట్టు చప్పుడు కాకుండా స్మశానికి తీసుకెళ్లి పాతిపెట్టింది.

అయితే దీనిపై థామస్ సమీప బంధువు చార్లెస్ కి అనుమానం వచ్చింది. 14 ఏళ్ల వ్యవధిలో కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా చనిపోవడంపై సందేహం కలిగింది. ఏదో జరిగిందని డౌట్ రావడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోవడం పోలసులను విస్మయానికి గురి చేసింది.

14 ఏళ్ల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోవడం వారికి కూడా అనుమానాస్పదంగా అనిపించింది. పోలీసులు మృతదేహాలను తిరిగి బయటికి తీయించారు. వాటిని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం నివేదికలో సంచలన నిజం బయటపడింది. వారిది సహజ మరణం కాదు, మర్డర్ అని తేలింది. అందరికి సైనెడ్ ఇచ్చి చంపేశారని తేలింది. పోస్టుమార్టం నివేదిక చూసి పోలీసులు షాక్ అయ్యారు. జాలీ జోసెఫ్, ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించారు. దీంతో వారు నేరాన్ని అంగీకరించారు. ఆస్తి కోసం తామే మటన్ సూస్ లో సైనెడ్ ఇచ్చి చంపేశామని ఒప్పుకున్నారు.

ముఖ్య గమనిక: వార్తలు, కథనాలు, భక్తి సమాచారం వ్రాయాలనుకున్తున్నారా...? మీ వివరాలను info@pslvtv.com OR pslvtv@gmail.com మెయిల్ చేయగలరు

 

మటన్ సూప్ లో సైనడ్ కలిపి ఆస్తికోసం 6 గురిని అంతం చేసింది...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *