Top Ad unit 728 × 90

వ్యవసాయానికి పెద్దపీట...!

వ్యవసాయానికి పెద్దపీట...!

దేశంలో వ్యవసాయ రంగానికి మంచి రోజులు రాబోతున్నాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి పార్లమెంట్‌కు ప్రతిపాదించనున్న సార్వత్రిక బడ్జెట్‌లో వ్యవసాయ పరిశోధన, విద్యా రంగానికి పెద్దపీట వేసి కేటాయింపులను 15 శాతం మేరకు (దాదాపు రూ.8 వేల కోట్లకు) పెంచే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2018-19) సంబంధించిన సార్వత్రిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. 

గత కొన్ని సంవత్సరాల నుంచి బడ్జెట్‌లో వ్యవసాయ విద్యకు కనీసం 10 శాతం మేరకు కేటాయింపులను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో వ్యవసాయ పరిశోధన, విద్య విభాగానికి (డీఏఆర్‌ఈ) అదనంగా 15 శాతం కేటాయింపులు జరుపుతుందని ఆశిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశానికి వెన్నెముకలా నిలుస్తున్న వ్యవసాయ రంగంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆధునిక ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న సంకల్ప సాధన దిశలో వేగవంతంగా ముందుకు సాగేందుకు ప్రాధాన్యతా రంగాల వారీగా ఈ నిధులను వినియోగించడం జరుగుతుందని ఆ వర్గాలు వివరించాయి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగానికి తొలుత రూ.6,800 కోట్లు కేటాయించిన కేంద్ర వ్యవసాయానికి పెద్దపీట! ప్రభుత్వం ఆ తర్వాత అనుబంధ పద్దు ద్వారా ఈ విభాగానికి మరికొన్ని కేటాయింపులు జరపడంతో ఈ మొత్తం కేటాయింపులు దాదాపు రూ.7 వేల కోట్లకు చేరాయి. వచ్చే ఆర్థిక సంవత్సం దేశంలోని వివిధ ప్రాంతాల్లో, ప్రత్యేకించి ఆర్థికంగా వెనుకబడిన 150 జిల్లాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వ్యవసాయ ఆవిష్కరణలను ఉపయోగించడం ద్వారా గిరిజన ప్రాంతాల్లోని రైతుల సామర్ధ్యాన్ని పెంపొందించడంపై దృష్టి కేంద్రీకరించాలని డీఏఆర్‌ఈ యోచిస్తున్నది.

వ్యవసాయానికి పెద్దపీట...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *