Top Ad unit 728 × 90

కోటి రూపాయల జీతంతో ఉద్యోగం

కోటి రూపాయల జీతంతో ఉద్యోగం

మనసుంటే మార్గముంటుంది.. పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది ఉండదంటారు.. ఈ మాటను అక్షరాలా రుజువు చేశారు పంజాబ్‌కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ(ఎల్పీయూ) విద్యార్థిని కవిత ఫమన్‌. ఈ యూనివర్సిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్‌(ఆగ్రోనమీ) చివరి సంవత్సరం చదువుతున్న కవిత.. బహుళజాతి విత్తన, ఎరువుల సంస్థ మోన్‌శాంటోలో ఏకంగా రూ.కోటి వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సంపాదించి సత్తా చాటారు. పురుగుమందులు , విత్తనాభివృద్ధి సంస్థ అయిన బేయర్స్‌ కంపెనీ ఆమె ప్రతిభను గుర్తించింది. దీంతో దాని అనుబంధ సంస్థ అయిన మోన్‌శాంటో కెనడా విభాగంలో ప్రొడక్షన్‌ మేనేజర్‌ ఉద్యోగాన్ని కల్పించింది. చిన్నప్పటినుంచి చదువులో రాణించే కవిత ఫమన్‌.. కుటుంబసభ్యులు వ్యవసాయం చేసేవారు. చిన్నప్పుడే వ్యవసాయంలోని మెళుకువలు నేర్చుకున్న ఆమెకు.. పెద్దయ్యాక అగ్రికల్చర్‌ ఆఫీసర్ అవ్వాలన్న కోరిక పుట్టిందట. దాంతో డిగ్రీ తర్వాత ఎంఎస్సీ అగ్రికల్చర్‌ సైన్స్ లో చేరారు. చదువుతూనే వ్యవసాయ తోటలకు వెళ్లి పరిశీలించేవారు.

తనకు తెలిసిన నైపుణ్యాన్ని రైతులకు చెప్పేది.. అలాగే వారినుంచి కొంత సమాచారాన్ని సేకరించేది. ఇలా ఆగ్రోనమీ విభాగంలో మంచి ప్రావిణ్యం సంపాదించారు. దీంతో ఇటీవల యూనివర్సిటీలో జరిగిన క్యాంపస్ సెలెక్షన్లలో ఆమె ప్రిలిమినరీ పరీక్ష, ఇంటర్వ్యూ కు అర్హత సాధించారు. అంతేకాకుండా బేయర్స్‌ దిగ్గజ శాస్త్రవేత్తలు నిర్వహించే అతి కష్టమైన ఇంటర్వ్యూలో సైతం అర్హత సాధించారు. దీంతో ఆమె ప్రతిభను గుర్తించిన మోన్‌శాంటో ప్రతినిధులు కవితకు కోటి రూపాయల ప్యాకేజీతో ప్రొడక్షన్‌ మేనేజర్‌ ఉద్యోగాన్ని ఆఫర్‌ చేశారు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు.. తన ప్రతిభకు దక్కిన వేతనంగా ఆమె భావిస్తున్నారు. ఇక తమ విద్యార్థిని భారీ ప్యాకేజీతో ఉద్యోగం​ సంపాదించడం పట్ల యూనివర్సిటీ డైరెక్టర్‌ అమన్‌ మిత్తల్‌ సంతోషం వ్యక్తం చేశారు. మంచి ప్యాకేజీలు రావన్న కారణంతో అగ్రికల్చర్‌ కోర్సులను చదివేందుకు విద్యార్థులు ఇష్టపడటం లేదని, ఏడు అంకెల వేతనం దక్కడం ఇదే మొదటిసారి అని తెలిపారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

కోటి రూపాయల జీతంతో ఉద్యోగం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *