Top Ad unit 728 × 90

న్యూజిలాండ్ ప్రధానికి చిన్నారి లంచం!

న్యూజిలాండ్ ప్రధానికి చిన్నారి లంచం!

వెల్లింగ్టన్: డ్రాగన్లపై పరిశోధనలు జరుపాలని కోరుతూ పదకొండేండ్ల బాలిక న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్‌కు 5 న్యూజిలాండ్ డాలర్లను లంచంగా ఇచ్చింది! అయితే ప్రధాని ఆ డబ్బును తిరిగి ఆ చిన్నారికి పంపారు. న్యూజిలాండ్‌కు చెందిన విక్టోరియా అనే బాలిక డ్రాగన్లపై ఆసక్తి పెంచుకుంది. టైలికైనెటిక్ పవర్స్ ద్వారా డ్రాగన్లకు శిక్షకురాలిగా మారాలని భావించింది. ఇందుకోసం టెలీ కైనెటిక్స్, డ్రాగన్లపై పరిశోధనలు జరుపాలని ఆ దేశ ప్రధానికి లేఖ రాసింది. అలాగే 5 న్యూజిలాండ్ డాలర్లను లంచంగా పంపింది. ఆ చిన్నారి లేఖకు స్పందించిన ప్రధాని.. ఆ బాలికకు తిరిగి లేఖ రాశారు. ఫిజిక్స్, డ్రాగన్ల విషయంలో నీ సూచనలు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తూ, ప్రస్తుతం మేం ఈ విభాగాల్లో ఎలాంటి పరిశోధనలు చేయడం లేదు. కాబట్టి నువ్వు లంచంగా ఇచ్చిన డబ్బును తిరిగి పంపుతున్నా. టెలీకినెసిస్, టెలీపతి, డ్రాగన్ల అన్వేషణలో నీ ప్రయత్నాలు ఫలించాలని ఆశిస్తున్నాను అని ప్రధాని అందులో పేర్కొన్నారు.

పీ.ఎస్. డ్రాగన్లపై నేను ఓ కన్నేసి ఉంచుతాను. ఇంతకూ డ్రాగన్లు సూట్ వేసుకుంటాయా? అని సరదాగా ప్రశ్నించారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

న్యూజిలాండ్ ప్రధానికి చిన్నారి లంచం! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *