Top Ad unit 728 × 90

సంబంధాల బలోపేతానికి నాలుగు ఒప్పందాలు

సంబంధాల బలోపేతానికి నాలుగు ఒప్పందాలు

బీజింగ్‌: ద్వైపాక్షిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో భారత్‌, చైనాలు సోమవారం నాలుగు ఒప్పందాలపై సంతకాలుచేశాయి. సాంస్కృతిక, ప్రజల మధ్య మార్పిడి అంశాలపై చర్చించేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ హాజరైన ఇరుదేశాల ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గాలు మలి భేటీ అనంతరం ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. చైనాలో మూడు రోజుల అధికార పర్యటన జరుపుతున్న విదేశాంగ మంత్రి జైశంకర్‌ చైనా ఉపాధ్యక్షుడు వాంగ్‌ కిషన్‌, విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇతో భేటీ అయి అనేక అంశాలపై చర్చలు జరిపారు. సాంస్కృతిక మార్పిళ్లు, ఆరోగ్య పరిరక్షణ, క్రీడలు, మ్యూజియం నిర్వహణలో సహకారం వంటి అంశాలపై ఇరుదేశాలు నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ప్రభుత్వం ఒక అధికార ప్రకటనలో వివరించింది. ఇరుదేశాల మధ్య సాంస్కృతిక మార్పిళ్లు, సాంస్కృతిక వారసత్వ చిహ్నాల పరిరక్షణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, వారసత్వ పురావస్తు కేంద్రాల నిర్వహణ వంటి అంశాలలో పరస్పరం సహకరించుకునేం దుకు ఇరుదేశాలు ఒక అవగాహనకు వచ్చాయి.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

సంబంధాల బలోపేతానికి నాలుగు ఒప్పందాలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *