Top Ad unit 728 × 90

బేబీ పౌడర్‌లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు జాన్సన్‌కు ముందే తెలుసా

బీ పౌడర్‌లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు జాన్సన్‌కు ముందే తెలుసా?

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ గత కొంతకాలంగా పలు వివాదాల్లో చిక్కుకుంది. ఆ సంస్థ తయారు చేసిన బేబీ పౌడర్‌ వల్ల తమకు క్యాన్సర్‌ సోకినట్లు పలువురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. అయితే బేబీ పౌడర్‌లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు జాన్సన్‌కు ముందే తెలుసా? అంటే అవుననే చెబుతోంది ఓ అంతర్జాతీయ మీడియా కథనం.

తాము తయారుచేసిన బేబీ టాల్కమ్‌ పౌడర్‌లో ఆస్‌బెస్టాస్‌ అనే క్యాన్సర్‌ కారకం ఉన్నట్లు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి దశాబ్దాలుగా తెలుసని సదరు మీడియా కథనం పేర్కొంది. బేబీ పౌడర్‌లో ఆస్‌బెస్టాస్‌ ఆనవాళ్లు ఉన్నట్లు 1971లోనే జాన్సస్‌ సంస్థ గుర్తించిందని తెలిపింది. ఈ విషయమై ఇటీవల కంపెనీపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయిటర్స్‌ మీడియా సంస్థ పలు పత్రాలను అధ్యయనం చేసి కథనం రాసింది.

అయితే ఈ వార్తలను జాన్సన్‌ కొట్టిపారేసింది. ఇవన్నీ కల్పిత వార్తలని, నిజాన్నితప్పుదోవ పట్టించేందుకు చేసే ప్రయత్నాలను కంపెనీ ఆరోపించింది. తమ టాల్కమ్‌ పౌడర్‌లో ఎలాంటి క్యాన్సర్‌ కారకాలు లేవని ఇప్పటికే చాలా పరీక్షలు రుజువుచేశాయని కంపెనీ గ్లోబల్‌ మీడియా రిలేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎర్నీ నీవిట్జ్‌ తెలిపారు.

మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో అమెరికా మార్కెట్లో శుక్రవారం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ షేర్లు కుప్పకూలాయి. షేరు విలువ 10శాతం మేర పడిపోయింది. 16ఏళ్లలో కంపెనీ షేర్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బేబీ పౌడర్‌తో పాటు షవర్‌ ఉత్పత్తుల్లోనూ క్యాన్సర్ కారకాలు ఉన్నాయంటూ జాన్సన్‌ కంపెనీపై 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

బేబీ పౌడర్‌లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు జాన్సన్‌కు ముందే తెలుసా Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *