Top Ad unit 728 × 90

ఇమ్రాన్‌ విమానం తిరిగి ఇచ్చేయాలి: సౌదీ రాజు

ఇమ్రాన్‌ విమానం తిరిగి ఇచ్చేయాలి: సౌదీ రాజు

పాకిస్థాన్ కు చెందిన ఓ స్థానిక దినపత్రిక నేడు ప్రచురించిన కథనం తీవ్ర కలకలం రేపుతోంది. యూఎన్జీఏ సమావేశాల నిమిత్తం అమెరికాకు వెళ్లడానికి ఇమ్రాన్ ఖాన్ కు సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఓ అత్యాధునిక ప్రైవేట్ జెట్ ను సమకూర్చారు. అందులోనే ఇమ్రాన్ అమెరికా వెళ్లి, తిరిగి ఇస్లామాబాద్ వెళ్లిపోయారు. ఇప్పుడా విమానాన్ని వెంటనే వెనక్కు తిరిగి ఇచ్చేయాలని సౌదీ రాజు కోరినట్టు సదరు పత్రిక ప్రచురించింది. యూఎన్జీయే సమావేశాల్లో ఇమ్రాన్ వైఖరి సౌదీ రాజుకు నచ్చలేదని కూడా వెల్లడించింది. కాగా, యూఎన్జీఏ సమావేశాలకు హాజరయ్యే క్రమంలో సౌదీ అరేబియాను సందర్శించిన ఇమ్రాన్ ఖాన్ కు, సల్మాన్ ఈ కార్పొరేట్ విమానాన్ని సమకూర్చారు. దానిలోనే అమెరికాకు వెళ్లిన ఇమ్రాన్, తిరిగి ఇస్లామాబాద్ కు దానిలోనే చేరుకున్నారు. ఇప్పుడీ కథనంపై పాక్ లో చర్చ సాగుతుండగా, ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం ఈ వార్త అవాస్తవమని ఖండిస్తున్నారు. ఇది నిరాధార కథనమని, సౌదీ అరేబియాతో పాక్ కు సత్సంబంధాలున్నాయని అంటున్నారు.

ముఖ్య గమనిక: వార్తలు, కథనాలు, భక్తి సమాచారం వ్రాయాలనుకున్తున్నారా...? మీ వివరాలను info@pslvtv.com OR pslvtv@gmail.com మెయిల్ చేయగలరు.

ఇమ్రాన్‌ విమానం తిరిగి ఇచ్చేయాలి: సౌదీ రాజు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *