Top Ad unit 728 × 90

49 మంది పిల్లలకు ఆ డాక్టరే తండ్రి..తన వీర్యాన్నే..

49 మంది పిల్లలకు ఆ డాక్టరే తండ్రి..తన వీర్యాన్నే..

సంతానం లేమి బాధపడుతున్న దంపతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఓ డాక్టర్ నీచమైన పనికి పాల్పడ్డాడు. నెదర్లాండ్‌కు చెందిన ఓ డాక్టర్ దాతల నుంచి సేకరించిన వీర్యానికి బదులు తన వీర్యాన్నే స్త్రీల గర్భంలోకి ప్రవేశపెట్టి వారిని మోసం చేశాడు. అయితే ఈ విషయం అతడు చనిపోయిన రెండేళ్ల తర్వాత బయటపడింది.  నిజ్మేగెన్ నగరంలోని రొట్టెర్డామ్ క్లీనిక్‌‌ నడుపుతున్న డాక్టర్ జనత్ కర్బాత్ ఐవీఎఫ్ విధానం ద్వారా మహిళలకు కృతిమ గర్భధారణను కలిగిస్తాడు. అతను దుర్బుద్ధితొ
దాతల వీర్యానీకి బదులు అతని వీర్యాన్నే వారికి ఎక్కించేవాడు.

కర్బాత్ క్లీనిక్‌పై అనుమానాలు వ్యక్తం చేసిన కొన్ని జంటలు కోర్టును ఆశ్రయించాయి. అనంతరం కోర్టు ఆదేశాలతో కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ వివరాలు సేకరించారు.అతని డీఎన్ఏను చిన్నారుల డీఎన్ఏతో పోల్చి చూడగా కర్బాత్ 49 మంది పిల్లలకు తండ్రని తేలింది. గతంలో కూడా కర్బాత్ అనేక అవకతకలు చేయడంతో అతని క్లీనిక్‌ను అధికారులు మూసివేశారు. అప్పట్లో కూడా తన వీర్వాన్నీ మహిళలకు ఎక్కించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత తిరిగి అధికారుల అనుమతితో మళ్లీ క్లీనిక్ ప్రారంభించాడు. కానీ అతని బుద్ది మారలేదు. దాతల వీర్యంలో తన వీర్యం కలిపి స్త్రీల గర్భంలోకి ప్రవేశపెట్టేవాడు. అంతేకాకుండా అతని వీర్యాన్నీ మరికొన్ని ఐవీఎఫ్ క్లినిక్‌లకు కూడా పంపేవాడు. కర్బాత్ మరణంతరం ఈ విషయం ఆ క్లీనిక్‌లో చికిత్స పోందిన దంపతులకు తెలియడంతో వారు కోర్టును ఆశ్రయించారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

49 మంది పిల్లలకు ఆ డాక్టరే తండ్రి..తన వీర్యాన్నే.. Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *