ఇరాన్ భద్రతా ఏజెంట్లతోనే అంతం
ఇరాన్ భద్రతా ఏజెంట్లతోనే అంతం
-3 గదుల్లో బాంబులు పెట్టించిన మొస్సాద్‌హమాస్ చీఫ్ హనియా హత్య తీరిదీ.
ఇంటర్నెట్ డెస్క్: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు ఇరాన్ భద్రతా సిబ్బందినే ఇజ్రాయెల్ వినియోగించుకుంది.
ఇద్దరు ఇరాన్ ఏజెంట్లను ఆ దేశానికి చెందిన మొస్సాద్... తనవైపు తిప్పుకొని వారితోనే బాంబులు పెట్టించి హతమార్చింది. ఆ ఇద్దరు ఏజెంట్లు 3 గదుల్లో బాంబులు పెట్టి వాటిని నూతన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు హనియా వచ్చినప్పుడు పేల్చేశారు. ఇరాన్ అధికారులవద్ద ఉన్న సీసీ కెమెరాల్లో... ఇద్దరు ఏజెంట్లు భవనంలోని పలు గదుల్లో రహస్యంగా తిరిగినట్లు రికార్డయింది. నిమిషాల వ్యవధిలోనే వారు ఆ పని చేసినట్లు తేలింది. ఆ తర్వాత దేశం విడిచి రహస్య ప్రదేశానికి వెళ్లినా అక్కడ ఉన్న తమ వేగుతో సంబంధాలను కలిగి ఉన్నట్లు సమాచారం. దీంతోనే బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో బాంబులను పేల్చినట్లు తెలుస్తోంది. మొస్సాద్ ఏజెంట్లుగా పని చేసినవారు అన్సార్-అల్-మహదీ ప్రొటెక్షన్ గ్రూపునకు చెందినవారని తెలిసింది. ఈ గ్రూప్ దేశంలోనూ, బయటా అత్యున్నత స్థాయి నేతల భద్రతను చూస్తుంది.
హనియాను హత్య చేయడానికి స్వల్ప శ్రేణి ప్రొజెక్టైల్‌ను వాడినట్లు తెలుస్తోంది. 7 కేజీల వార్‌హెడ్‌ను ఉపయోగించినట్లు సమాచారం. ఈ ఘటన తమ దేశాన్ని తీవ్ర ఇబ్బందికి గురిచేసేదని, భద్రతాపరంగా భారీ వైఫల్యమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ) అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రతీకారంగా హెజ్‌బొల్లాతో కలిసి ఇజ్రాయెల్‌పై నేరుగా దాడి చేయాలని ఐఆర్‌జీసీ భావిస్తోంది.