Top Ad unit 728 × 90

చైనా ఇవేం పనులు..!

చైనా ఇవేం పనులు..!

చైనా వద్దకు వచ్చేసరికి ఎంతటి అంతర్జాతీయ చట్టమైనా చట్టుబండలు కావాల్సిందే. ఏవీ పట్టించుకోదు.. తన పని జరిగి తీరాల్సిందే. ఈ క్రమంలో ప్రకృతి.. జీవజాలం వంటి అంశాల ఊసే కనిపించదు. ఇలా ఓ చట్టం ఇటీవలే చట్టుబండలైంది. అదేంటో చూద్దాం. 
తన భూభాగానికి బయట ఆఫ్రికాలో తొలిసారి జబౌటీలో ఒక సైనిక స్థావరాన్ని నిర్మించింది. మరికొన్నేళ్లలో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. సాధారణంగా ఇది సముద్రం ఒడ్డునే ఉంది. ఇక్కడ ఇప్పుడు చైనా ఏడు ప్లాట్‌ఫారాలను నిర్మించాలని తలపెట్టింది. వీటిల్లో ఒకటి కేవలం చైనా నావికాదళం కోసమే ప్రత్యేకంగా వినియోగించనుంది. 
2018మేలో ఇక్కడ పనులను మొదలు పెట్టింది. కానీ మధ్యలో తుపాన్లు, సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడంతో పనులు మందగించాయి. కానీ సెప్టెంబర్‌, అక్టోబర్‌ నుంచి పనులు వేగవంతం చేసింది. ఈ క్రమంలో  సముద్రగర్భంలో భారీ పేలుళ్లకు పాల్పడుతోంది. అవి ఎంత తీవ్రంగా ఉన్నాయంటే అంతరిక్షంలోని ఉపగ్రహాలకు కూడా స్పష్టంగా కనిపించే స్థాయిలో ఉన్నాయి. దీంతో ఆ ప్రదేశంలో సముద్రం ఒక్కసారిగా చిందరవందరగా మారిపోయింది. డిసెంబర్‌ 6వ తేదీన  చైనా భారీపేలుడుకు పాల్పడింది. 250 మీటర్ల మేరకు నీరు ఒక్కసారిగా పొంగింది. ఇటువంటివి చాలా పేలుళ్లు జరిపి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. 
సముద్ర గర్భంలో భారీ పేలుళ్లు జరపడం అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం. చైనా పేలుళ్ల దెబ్బకు అక్కడ ఉన్న జీవజాలం దాదాపు అంతరించిపోయింది. జబౌటీలో వీటిని పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతోపాటు వివిధ దేశాలు సముద్రగర్భంలో ఏర్పాటు చేసుకొనే సెన్సర్‌ వ్యవస్థలను దెబ్బతీసేందుకు ఇలాంటిపేలుళ్లు జరిపి ఉండవచ్చని సైనిక నిపుణులు భావిస్తున్నారు. తమ నౌకల రాకపోకలను పసిగట్టే వీలు లేకుండా చైనా ఈ పనిచేసింది. 
సైనిక స్థావరాల దేశం..
ప్రపంచంలోని అగ్రరాజ్యాలుగా పేరున్న దేశాలకు జబౌటీలో సైనిక స్థావరాలు ఉన్నాయి. ఆసియా- యూరప్‌ వర్తక మార్గంలో ఆఫ్రికా వద్ద అత్యంత కీలకమైన బాబ్‌ ఎల్‌ మండబ్‌ వద్ద జిబౌటీ ఉంది. ఇది పేద దేశం కావడంతో తన భూభాగాన్ని విదేశాలకు లీజుకు ఇచ్చి ఆదాయం పొందుతుంది. దీంతో అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్‌, చైనా, జపాన్‌ వంటి దేశాలు ఇక్కడ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకొన్నాయి. 

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

చైనా ఇవేం పనులు..! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *