Top Ad unit 728 × 90

హ్యుందాయ్ సంచలన నిర్ణయం... మారుతి ఖేల్ ఖతం!

హ్యుందాయ్ సంచలన నిర్ణయం... మారుతి ఖేల్ ఖతం!

సంపన్నుల కంటే సామాన్యులు అధికంగా దేశంలో కస్టమర్లను ఆకట్టుకోవాలంటే.. సామాన్యులకు అనుగుణంగానే ఉత్పత్తులను ప్రవేశపెట్టాలి. ఇలా ప్రజల నాడిని పట్టుకున్న సంస్థలు అగ్రగామిగా వెలుగొందుతున్నాయి. అందులో ఒకటి మారుతి సుజుకి. అత్యంత సరసమైన ధరలో సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరలో కార్లను ప్రవేశపెట్టి మార్కెట్లో సింహభాగాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు మారుతి సుజుకి సైతం అవాక్కయ్యే సంచలన వార్త హ్యుందాయ్ తెచ్చింది. అవును.. ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లను సామాన్యులకు కూడా అందుబాటులో తెచ్చేందుకు మారుతి తరహాలో కేవలం 10 లక్షల్లోపే తమ కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. కొసమెరుపు ఏమిటంటే మారుతి పెట్రోల్ డీజల్ కార్లను చీపెస్ట్ ధరలో అందిస్తుంటే.. హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్ల మీద దృష్టి సారించింది.

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఈ మధ్యనే విపణిలోకి తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 25.30 లక్షలుగా కంపెనీ ఖరారు చేసింది.

ఇటి ఆటో ఇండియా కథనం మేరకు, హ్యుందాయ్ మరో ఎలక్ట్రిక్ కారును ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం తీసుకురానున్నట్లు సమాచారం. సామాన్యులకు సైతం కొనుగోలు చేసే విధంగా రూ. 10 లక్షల లోపు ధరతోనే దీనిని ప్రవేశపెడుతున్నట్లు తెలిసింది.

ఇండియన్ కస్టమర్ల కోసం, ఇండియన్ రోడ్లకు అనుగుణంగా ప్రత్యేకంగా అభివృద్ది చేస్తున్న ఈ మోడల్‌ను చెన్నైలో ఉన్న కంపెనీ ప్లాంటులో దీనిని ఉత్పత్తి చేయనున్నారు. మిడిల్-ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా మరియు ఆసియాలోని పలు మార్కెట్లకు దీనిని ఇండియా నుండి ఎగుమతి చేయనున్నారు.

అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది మరియు తయారీ కోసం ఇప్పటికే రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్లలో ఎలాంటి మోడళ్లు ఉంటాయనేది ఇంకా స్పష్టం కాలేదు. మినీ ఎస్‌యూవీ లేదా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్టైల్లో ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చే అకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

టొయొటా యారిస్ మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది, తయారీ మరియు సేల్స్‌ను పెంచేందుకు వాహన తయారీ సంస్థలకు మరియు కొనుగోలుదారులకు ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇదే సరైన సమయం అని భావించిన హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సిద్దమైంది.

ఎలక్ట్రిక్ కార్ల తయారీతో పాటు వీటికి కావాల్సిన బ్యాటరీ తయారీ ప్లాంటును నెలకొల్పేందుకు హ్యందాయ్ ప్రయత్నిస్తోంది. మారుతి సుజుకి మరియు టాటా మోటార్స్ రెండు సంస్థలు కూడా ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. వీటి మాదిరిగానే హ్యుందాయ్ కూడా తమ సొంతం ప్లాంటును నెలకొల్పుతోంది.

దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలను అభివృద్ది మరియు తయారు చేసేందుకు పలు అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఎల్‌జీ, సామ్‌సంగ్ ఎస్‌డిఐ మరియు ఎస్‌కె ఇన్నోవేషన్స్‌తో పాటు చైనీస్ సంస్థలతో కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.

హ్యుందాయ్ ఇండియా విభాగం దేశీయ విపణిలోకి విడుదల చేసిన తొలి ఎలక్ట్రిక్ కారు కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 39.2kWh కెపాసిటీ గల బ్యాటరీ కలదు. 100kW ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 131బిహెచ్‌పి పవర్ మరియు 395ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ ప్రకారం సింగల్ ఛార్జింగ్‌తో 452కిమీల మైలేజ్ ఇస్తుంది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

హ్యుందాయ్ సంచలన నిర్ణయం... మారుతి ఖేల్ ఖతం! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *