Top Ad unit 728 × 90

రేపు, ఎల్లుండి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు...!

రేపు, ఎల్లుండి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు...!

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా 5 కిలోమీటర్ల ఎత్తులో వాయువ్య దిశగా ఉపరితల ఆవర్తనం ఉందన్నారు. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత తీవ్రంగా మారి, ఉత్తర వాయువ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంట 45-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. వాతావరణ పరిస్థితి దృష్ట్యా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

రేపు, ఎల్లుండి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *