Top Ad unit 728 × 90

నోటి పుండ్లకు ఇంట్లోనే చికిత్స

నోటి పుండ్లకు ఇంట్లోనే చికిత్స

నోటి పుండ్లు ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సందర్భంలో బాధించే సమస్య. నోటి పూత కారణంగా ఆహారం, నీరు తీసుకోవడానికి ఇబ్బంది పడటం జరుగుతుంది. అందుకని ఇక్కడ చెప్పుకునే ఇంటి చిట్కాలు ఫాలో అవ్వడం వలన నోటి పుండ్ల సమస్త నుండి బయటపడవచ్చు.
- నోటి పుండ్లు లేదా నాలుకపూత సమస్యతో బాధపడుతున్నప్పుడు కొద్దిగా తేనె తీసుకుని పుండ్లుగా ఉన్న భాగంలో రాసుకోవాలి. ఇలా చేయడం వలన నొప్పి తగ్గి ఉపశమనం లభిస్తుంది. తేనెలో ఆమ్లా పౌడర్‌ కాస్త కలుపుకుని నోటి పూతపై రాసుకున్నా సరే మంచి ఫలితం ఉంటుంది.
నోటిలో పుండ్లు ఉన్నప్పుడు నెయ్యి లేదా కొబ్బరి నూనెను వాటి చుట్టూ రాసుకుని నెమ్మదిగా మసాజ్‌ చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు నోటిలో నీరు ఊరటం జరుగుతూ ఉంటుంది. అలా జరగగానే బయటకు ఉమ్మి వేయాలి. మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత నెయ్యి లేదా కొబ్బరి నూనె రాసుకోవడం చేయాలి. ఇలా చేయడం వలన నోటి పుండ్లు త్వరగా నయం అవుతాయి. అలాగే ఉప్పు నీటితో పుక్కిలించడం వలన నోటిలో పుండ్లు త్వరగా నయం అవుతాయనేది వాస్తవమే కానీ కాస్త మంట పుడుతుంది. ఒక స్పూన్‌ ఉప్పు తీసుకుని, ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో వేసుకోవాలి. ఉప్పు బాగా కరిగిన తర్వాత ఈ నీటితో పుక్కిలించుకోవడం వలన తక్షణ ఉపశమనం లభిస్తుంది. అయితే ఇలా చేస్తున్నప్పుడు కాస్త మంటగా ఉండటం నిజమే. నోటి భాగంలో ఇంకా ఉప్పగా ఉన్నట్లు అనిపిస్తే మంచి నీటితో నోటిని పుక్కిలించుకోవాలి.
ఇక తులసి ఆకుల వలన ఆరోగ్యపరంగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నోటి పుండ్లు ఉన్నప్పుడు కొన్ని తులసి ఆకులు తీసుకుని బాగా నమలడం వలన తులసి ఆకుల నుండి వచ్చే రసం నోటి పుండ్లను త్వరగా నయం అయ్యేలా చేస్తుంది. అలాగే ఒక గ్లాస్‌ నీటిలో తులసి ఆకులను ఉంచుకుని ఈ నీటిని సేవించినా మంచి ఫలితం ఉంటుంది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

నోటి పుండ్లకు ఇంట్లోనే చికిత్స Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *