Top Ad unit 728 × 90

గులాబీ రేకుల్లాంటి పెదవులు మీ సొంతం అవ్వాలనుకుంటున్నారా?

గులాబీ రేకుల్లాంటి పెదవులు మీ సొంతం అవ్వాలనుకుంటున్నారా?

పెదవుల్లో తేమ తగ్గిపోవడం వల్లే అవి పొడిబారినట్లు కనబడతాయి. దీన్ని తగ్గించి గులాబీ రేకుల్లాంటి పెదవులు పొందాలంటే ఈ టిప్స్ పాటించండి. ముందుగా చిన్నారులు వాడే టూత్‌బ్రస్‌తో పెదవుల్ని మృదువుగా రుద్దాలి. ఇలాచేస్తే మృతచర్మం తొలగిపోతుంది. నిగారింపూ సంతరించుకుంటాయి.

* బ్లాక్ టీ బ్యాగును గోరు వెచ్చని నీటిలో ముంచండి. 5 నిమిషాలయ్యాక ఈ బ్యాగును నేరుగా పెదవులపై ఉంచండి. ఇలా నాలుగైదుసార్లు చేస్తే చాలు అదరాలు తేమను సంతరించుకుంటాయి. తాజాగానూ కనిపిస్తాయి.

* తరచూ లిప్‌స్టిక్ రాసుకునే వారు దాన్ని తొలగించిన వెంటనే కాస్త వెన్న రాసుకోవాలి. అలా చేయడం వల్ల అవి పొడిబారే సమస్య ఉండదు.

* అరకప్పు పాలల్లో గుప్పెడు గులాబీ రేకులు గంటసేపు నానబెట్టి ఆ తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై పూతలా వేయాలి. అరగంటయ్యాక కడిగేస్తే చాలు. పెదవులు పగిలి నెత్తురు వస్తుంటే ఈ చిట్కాను ట్రై చేయండి. దీనివల్ల నలుపు తగ్గడమే కాకుండా గులాబీ రేకుల్లాంటి పెదవులు మీ సొంతం అవుతాయి.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

గులాబీ రేకుల్లాంటి పెదవులు మీ సొంతం అవ్వాలనుకుంటున్నారా? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *