Top Ad unit 728 × 90

మద్యపానం వల్ల మహిళలపై ఎలాంటి ప్రభావం పడుతుంది

మద్యపానం వల్ల మహిళలపై ఎలాంటి ప్రభావం పడుతుంది...?

వైద్యులు ఏమంటున్నారు...?

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి...?

మద్యం ప్రభావం పురుషులతో పాటు, మహిళల మీద కూడా ఉంటుందని చెన్నైకి చెందిన ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్. హెలెన్ అంటున్నారు. ఆల్కహాల్ మహిళల్లో గర్భధారణ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని ఆయన చెప్పారు.

మహిళ పునరుత్పత్తి వ్యవస్థలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు అత్యంత కీలకమైనవి. మన ఆహారపు అలవాట్లను బట్టి ఈ హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలు వస్తుంటాయి. మద్యం తాగడం వల్ల ఈ హార్మోన్లపై ప్రభావం పడుతుందని హోలెన్ చెబుతున్నారు.

వారంలో 6 నుంచి 14 సార్లు మద్యం తీసుకునే మహిళల్లో సంతాన సామర్థ్యం 20 శాతం నుంచి 25 శాతం తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.

అలాగని, అంతకంటే తక్కువ తాగితే ప్రభావం ఉండదని కాదు. అది, ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది.

మహిళల్లో అండం ఉత్పత్తి మీద కూడా ఆల్కహాల్ ప్రభావం ఉంటుంది. దాంతో, నెలసరి క్రమం తప్పుతుంది. గర్భం దాల్చడం కష్టమవుతుంది. ఒకవేళ గర్భం దాల్చినా.. అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

బిడ్డకు పాలిచ్చే తల్లులు కూడా మద్యానికి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

గమనిక:- వీడియోల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

మద్యపానం వల్ల మహిళలపై ఎలాంటి ప్రభావం పడుతుంది Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *