Top Ad unit 728 × 90

పనస తొనలు తింటున్నారా ? అయితే ఈ నిజాలు తెలుసుకోండి

పనస తొనలు తింటున్నారా ? అయితే ఈ నిజాలు తెలుసుకోండి

పనస పండును ఆంగ్లంలో Jackfruit అని అంటారు. పనస మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. తూర్పు ఆసియా దీని జన్మస్థలం. ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. దాదాపు ఒక్కో పండు 36 కేజీలుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. అత్యంత తియ్యని రుచిని, తీయటి వాసనను కలిగి ఉన్న పనస పండంటే అందరూ ఇష్టపడతారు. కొన్ని ప్రాంతాలలో పనస పొట్టును కూరగా కూడా చేసుకుంటారు. పనసపండు వేసవి కాలం నుండి సెప్టెంబర్ వరకు విరివిగా లభ్యం అవుతాయి.

పనస పండులో విటమిన్స్,ఖనిజాలు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పండులో 'ఏ','సి' విటమిన్లు తక్కువగాను, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండి ఆరోగ్యానికి బాగా సహాయపడుతాయి. చెట్టున పండిన కాయను, కోసిన వెంటనే తింటే, అది అంత రుచికరంగా ఉండదు. తయారైన కాయను కోసి, నిలువ ఉంచితే, ఆ పనస తొనలు చాలా తియ్యగా ఉంటాయి. పనస తొనలు త్వరగా జీర్ణం కావు. అందువల్ల మితంగా తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పనస పండులో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.

జీర్ణ సంబంధిత సమస్యలను అధిగమించడంలో పనసపండు సహాయపడుతుంది. పనసపండులో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్‌ క్యాన్సర్‌ వ్యాధిని నిరోధిస్తాయి. ఇందులో ఫైటోన్యూట్రియంట్స్ (phytO nutriyants) , ఐసోఫ్లేవిన్స్ (isOphlavins) ఉన్నందున కాన్సెర్ నివారణకు 
సహాయపడును. ప్రేగు, లంగ్ క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాలతో పోరాడడంలో ఈ పండు సహాయ పడుతుంది. పనసపండులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన రక్తపోటును నివారిస్తుంది.

రక్తపోటు ఉన్నవారు పొటాషియం సమృద్ధిగా ఉండే పనసతొనలను తింటే ఆ సమస్య తీవ్రత తగ్గుతుంది. ఆస్తమాతో బాధపడేవారికి పనస ఎంతో మేలు చేస్తుంది. పనస వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని కలిగించే కణాలు త్వరగా నశించకుండా పనస కాపాడుతుంది. అలాగే ఇందులో వయసు మళ్లే లక్షణాలు తగ్గించే గుణాలు ఉన్నాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

పనస తొనలు తింటున్నారా ? అయితే ఈ నిజాలు తెలుసుకోండి Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *