Top Ad unit 728 × 90

బిర్యానీని ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసుకుని తింటున్నారా..? ఐదేళ్ల చిన్నారి మృతి..

బిర్యానీని ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసుకుని తింటున్నారా..? ఐదేళ్ల చిన్నారి మృతి..

హోటల్స్‌లో తీసుకొచ్చిన బిర్యానీని పారేయలేక ఫ్రిజ్‌లో వుంచి మరుసటి రోజు వేడి చేసుకుని ఆరగించే అలవాటున్నవారు మీరైతే.. ఇకపై అలా చేయకండి. అలా చేశారో ప్రాణాలకే ప్రమాదమని చెప్పే ఓ ఘటన తమిళనాడులోని.. వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. బిర్యానీని మళ్లీ వేడి చేసుకుని తీసుకున్న కారణంగా ఐదేళ్ల చిన్నారి అస్వస్థతకు గురై.. ప్రాణాలు కోల్పోయింది. 

వివరాల్లోకి వెళితే.. వేలూరు జిల్లా అరక్కోణం, తండలం, న్యూ కాలనీకి చెందిన శ్రీనివాసన్-కనక దంపతులు బంధువుల ఇంటి శుభకార్యానికి వెళ్లారు. అక్కడ బిర్యానీ విందు ఏర్పాటు చేశారు. కానీ బిర్యానీ మిగిలిపోవడంతో.. ఈ దంపతులు ఇంటికి తెచ్చుకున్నారు. ఈ బిర్యానీని ఫ్రిజ్‌లో వుంచి.. మరుసటి రోజు మళ్లీ వేడి చేసుకుని.. ఆరగించారు. 

శ్రీనివాసన్ కుమార్తె గోపిక అనే ఐదేళ్ల చిన్నారి కూడా ఈ బిర్యానీని తీసుకుంది. మరో నలుగురు చిన్నారులు కూడా బిర్యానీని తీసుకుని అస్వస్థతకు గురైనారు. దీంతో అరక్కోణం ఆస్పత్రిలో గోపికతో పాటు నలుగురు చిన్నారులను చికిత్స నిమిత్తం తరలించారు. 

అక్కడ చికిత్స పొందుతూ.. గోపిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బిర్యానిని వేడి చేసి తినడం ద్వారా చిన్నా రి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

బిర్యానీని ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసుకుని తింటున్నారా..? ఐదేళ్ల చిన్నారి మృతి.. Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *