Top Ad unit 728 × 90

పిల్లల కోసం ఎదురు చూస్తున్నవారు ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకుని తీరాలి

పిల్లల కోసం ఎదురు చూస్తున్నవారు ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకుని తీరాలి

పెళ్లయిన వారికి పిల్లలు కలగక పోతే కలిగే వేదన అంతా ఇంతా కాదు. చుట్టూ వున్నవారి సూటి పోటీ మాటలతో మనసు కాకావికలం కాక తప్పదు. ఇటీవలి కాలంలో ప్రతి ఆరుగురిలో ఓ జంటకు సంతాన భాగ్యం చాలా కష్టంగా మారిందని అధ్యయనాలు చెబుతున్నాయి. అనేక సమస్యలు, కారణాలు, మారిపోయిన జీవితపు అలవాట్లు సంతాన లేమికి కారణమవుతున్నాయి. అయితే దీన్ని అదిగమించి సంతాన సాఫల్యత కోసం ఆధ్యాత్మికం నుంచి ఆధునిక వైద్యం వరకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అవన్నీ చేయాల్సిందే. మంచి ఆహారం తీసుకోవడం, మందులు సక్రమంగా వాడడం వంటివి తప్పనిసరిగా చేయాలి. వాటితో పాటుగా గర్భం రావాలంటే భార్యా భర్తల కలయికలకు కూడా కొన్ని లెక్కలున్నాయి. ఆ రోజుల్లో కలయిక జరిగితేనే పిల్లలు పుడతారు. అందుకే పిల్లల కోసం ఎదురు చూస్తున్నవారు ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకుని తీరాలి.


సాధారణంగా మహిళలు నెలసరి ఆయిన పన్నెండు రోజుల నుండి పదహారు రోజులలోపు అండం విడుదల అవుతుంది. ఈ సమయంలో భార్యాభర్తలు ఎన్ని ఎక్కువ సార్లు కలిస్తే అంత తొందరగా గర్బం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయాన్నే ఫలదీకరణ సమయం అని అంటారు. కొందరిలో ముందుగా గర్బం దాల్చే అవకాశం ఉంటుంది. కాని ఇది చాలా తక్కువ. ఇలాంటి ఘటనల్లో ఎనిమిది నుంచి పదిరోజుల లోపు అండం విడుదల అవుతుంది. దీన్ని ముందస్తు గర్భధారణ కాలం (పిరియడ్) అని అంటారు.


గర్బం దాల్చాలంటె ప్రతి ఋతు క్రమంలో అయిదు నుంచి ఆరు రోజులు.. అనగా ఫలదీకరణ సమయం మాత్రమే అందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయం ముందుగాని తరువాత గానీ కలయిక జరిగితే గర్బం వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. మహిళలకు ప్రతినెలా రుతుక్రమం కరెక్టు డేట్ కి రావటం చాల తక్కువ. అండం విడుదలయిన ఒకటి లేదా రెండు రోజుల్లోనే భార్యభర్తల కలయిక జరగాలి. దీంతో గర్బం దాల్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఇలా... ఫలదీకరణ సమయంలో తరచుగా భార్యాభర్తల కలయిక జరగాలి. కాని పురుషుడి వీర్యం సరిగా లేకపొతే రోజువిడిచి రోజు అయినా కలవాలి. వీర్య కణాల లోపం, కౌంట్ తక్కువగా ఉండడం వంటి సమస్యలుంటే ఫలదీకరణ సమయంలో కలయిక జరిగినా ఫలితం ఉండదు. అలాగే ప్రతి రోజూ కలయిక వీర్యకణాల సంఖ్య మీద కొద్దిగా ప్రభావం చూపుతుందట.. వీర్యకణ సమస్యల్లో ఉన్నవారికి. కావునా ఫలదీకరణ సమయంలో ఎక్కువగా కలయికలో పాల్గొనడం వల్ల గర్బం దాల్చడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి

 

గమనిక:- వీడియోల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

పిల్లల కోసం ఎదురు చూస్తున్నవారు ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకుని తీరాలి Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *