Top Ad unit 728 × 90

పటాస్ నుంచి శ్రీముఖి ఔట్ - అసలేం జరిగింది ?

పటాస్ నుంచి శ్రీముఖి ఔట్ - అసలేం జరిగింది ?

ఈ టీవీ ప్రసారం చేసే కామెడీ షో లలో బాగా ప్రేక్షక ఆదరణ పొందిన షో "పటాస్" షో . కామెడీ తో అలరించే ఈ షో నీ తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తుంటారు. ముఖ్యంగా ఈ షో కి ప్రారంభం నుండి యాంకర్లుగా రవి శ్రీముఖి రాణిస్తున్నారు. "పటాస్" షో మొదలైన నాటి నుండి వీరిద్దరు యాంకరింగ్ గా రాణిస్తూ షో లో హైలెట్ గా నిలుస్తూ "పటాస్" షో 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నారు.

ఇదిలావుండగా ఈ షో కి సక్సెస్ గా "పటాస్ 2" కూడా మొదలు పెట్టగా అది కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ సందర్భంలో యాంకర్ శ్రీముఖి ఈ షో నుంచి తప్పుకుంటున్నట్టు షాకిచ్చారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక వీడియోలో ఈ విషయాన్ని ప్రేక్షకులకు తన అభిమానులకు తెలియజేశారు. ముఖ్యంగా "పటాస్" షో గురించి మాట్లాడుతూ కెరీర్లో మర్చిపోలేని అత్యంత ఆదరణ ఇచ్చిన ప్రోగ్రామ్ అని ఇంత మంచి అవకాశం ఇచ్చి నన్ను నమ్మినందుకు "మల్లెమాల ఎంటెర్టైన్మెంట్స్" మరియు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి థాంక్స్ తెలుపుతున్నానని అన్నారు.

కానీ కొన్ని కారణాల వల్ల పటాస్ షో నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నానని,కాకపోతే తాను ఇలా బ్రేక్ తీసుకుంటున్నందుకు పటాస్ షో అభిమానులకు చెప్పడం తన భాద్యత అని అందుకే చెప్తునాన్నని ఒక వీడియో ద్వారా తెలియాజేశారు. అయితే మరోపక్క రెమ్యూనరేషన్ పరంగా సో నిర్వాహకులకు యాంకర్ శ్రీముఖి కి కొంత తేడా వచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

పటాస్ నుంచి శ్రీముఖి ఔట్ - అసలేం జరిగింది ? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *