Top Ad unit 728 × 90

`ఆర్ ఎక్స్` భామతో బాలయ్య...!

`ఆర్ ఎక్స్` భామతో బాలయ్య...!

పాయల్ రాజ్ పుత్ `ఆర్ ఎక్స్ 100` సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో నటించి బోల్డ్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ భామ ప్రస్తుతం వెంకటేష్ సరసన `వెంకీమామ` చిత్రంలో నటిస్తోంది. అలాగే `డిస్కోరాజా` లో రవితేజ కు జోడీగా నటిస్తోంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం మరో సీనియర్ హీరో సినిమాలో నటించే అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది. ఒకసారి వివరాల్లోకి వెళితే నందమూరి నటసింహం బాలకృష్ణ, కె.యస్.రవికుమార్ కలయికలో సి.కళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి `రూలర్` అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తోన్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ఒక హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా హరిప్రియ నటించనుందట. ఈ నెల 17న లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

`ఆర్ ఎక్స్` భామతో బాలయ్య...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *