Top Ad unit 728 × 90

చిన్న పిల్లలతో చూడకూడని సినిమా…! ఎందుకంటే...!

చిన్న పిల్లలతో చూడకూడని సినిమా…! ఎందుకంటే...!

 

ఓటిటిలో హారర్ సినిమాలకి కదవేం లేదు. అయినప్పటికీ ఓటిటిలోకి కొత్తగా వచ్చే హారర్ సినిమాలను చూడడానికి ఓ రేంజ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తారు హారర్ మూవీ లవర్స్.

సినిమా ఎలా ఉన్నా సరే హారర్ మూవీ అయితే చాలు అనుకునే వాళ్ళు భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఇలా హారర్ మూవీస్ అంటే క్రేజీగా ఫీల్ అయ్యే వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ మూవీనీ ఎక్కడ చూడొచ్చు? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

తెలుగులో కూడా స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ స్పానిష్ హారర్ సినిమా. నిజానికి ఓటిటిలు అనేవి అందుబాటులోకి వచ్చాక భాష అనే బారియర్ అడ్డు కాకుండా పోయింది. అయినప్పటికీ ఓటిటిలో పలు సినిమాలను డబ్ చేసి మరీ ఇతర లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హారర్ మూవీని కూడా తెలుగులో ఓటీటీలోకి తీసుకొచ్చేశారు.. అక్టోబర్ లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను స్పానిష్ తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో ఇజాక్వెల్ రోడ్రిక్స్, డిమియన్ సోలోమోన్ లీడ్ రోల్స్ చేశారు. సినిమా మొత్తం ఇద్దరి చుట్టే ఎక్కువగా తిరుగుతుంది. తమ గ్రామంలో ఉన్న దెయ్యానికి దొరకకుండా తప్పించుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నమే ఈ మూవీ స్టోరీ లైన్. డెమియన్ రుగ్మా ఈ మూవీకి దర్శకత్వం వహించగా, సినిమాలో ఉండే హారర్ ఎలిమెంట్స్, ట్విస్టులు, థ్రిల్లింగ్ రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఈ సినిమాను షౌడర్, అరోమోస్ సినీ, మొనాకో ఫిలిమ్స్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో అందుబాటులోకి వచ్చేసింది.

కథలోకి వెళ్తే…

ఇద్దరు అన్నదమ్ములైన పెడ్రో, జైన్ ఓ గ్రామంలో నివసిస్తారు. అదొక మారుమూల పల్లెటూరు కాగా ఇద్దరు అన్నదమ్ములు అక్కడే వ్యవసాయం చేసుకుంటారు. అయితే ఆ ఊర్లో దెయ్యం పుట్టబోతుందనే విషయాన్ని గమనిస్తారు. కానీ అది ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టక ముందే నాశనం చేయాలనే ఆలోచనతో ఆ దెయ్యం ఉద్భవించబోతున్న బాడీని నాశనం చేయడానికి ప్రయత్నం మొదలు పెడతారు. అది కాస్తా వాళ్ళని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. దెయ్యంతో పెట్టుకుంటే ఊరుకుంటుందా.. అది వీళ్ళపై బీభత్సంగా దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. మరి ఆ దయ్యాన్ని ఆపే క్రమంలో ఇద్దరు అన్నదమ్ములకు ఎదురైన సవాళ్లు ఏంటి? దాన్ని తప్పించుకొని వీళ్ళు బయట పడగలిగారా? అనే విషయాలు తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ‘వెన్ ఈవిల్ లర్క్స్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్ గానే ఓటీటీలోకి వచ్చిన ఈ హారర్ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. కానీ సినిమా చాలా వయోలెంట్ గా ఉంటుంది.

చిన్న పిల్లలతో చూడకూడని సినిమా…! ఎందుకంటే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *