తండేల్ స్టోరీ మొత్తం లీక్...!
పాపం నాగచైతన్య... తండేల్ స్టోరీ మొత్తం లీక్...!
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా తండేల్. ఎంతో కాలంగా వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఒక్కసారైనా హిట్ కూడా అందుకోవడం లేదు చైతన్య. దీంతో తను ప్రస్తుతం చేస్తున్న తండేల్ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.
అంతేకాదు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నాడు. దీనికోసం తన పూర్తి లుక్ మొత్తం మార్చేశాడు. అంతేకాకుండా నాగచైతన్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలను నెలకొన్నాయి. దాదాపుగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్
నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ టీజర్ అన్ని కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఈ సంవత్సరం క్రిస్మస్ కానుకగా విడుదల చేయాల్సి ఉంది. కానీ అనుకుని కారణాలవల్ల ఈ సినిమాను వాయిదా వేశారు అన్న వార్తలు వినబడుతున్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు లేదు. అయితే దీనికి కారణం రాంచరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కూడా అప్పుడే విడుదలవుతోంది. ఈ క్రమంలో తండేల్ సినిమాను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఇక మూవీ రిలీజ్ విషయం పక్కనపెడితే... సినిమాకి సంబంధించిన పూర్తి స్టోరీని ముందుగానే నిర్మాతబన్నీ బయటపెట్టేశాడు. బన్నీ వ్యాస్ ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త చిత్రం 'ఆయ్'ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో 'తండేల్' స్టోరీని వివరించాడు బన్నీ. ఇది ఒక అందమైన ప్రేమ కథ చిత్రం అని చెబుతూనే స్టోరీ మొత్తాన్ని బన్నీ వివరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ ఎంతో కొత్తగా అనిపించడంతోపాటు... ప్రేక్షకులను మచిలేశ్వరం నుంచి కరాచీకి తీసుకు వెళ్తుందని బన్నీ అన్నారు.