ఈనెల 24వ తేదీన షార్ట్ ఫిలిం పోటీలు
ఈనెల 24వ తేదీన షార్ట్ ఫిలిం పోటీలు...!
యువజన, క్రీడా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహించనున్నామని జిల్లా యువజన, క్రీడల అధికారి ఎన్.సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ యువ పార్లమెంట్ ఫెస్టివల్ లో భాగంగా ఈ పోటీలను నిర్వహించనున్నామని, 24న సికింద్రాబాద్ పీజీ కళాశాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నామన్నారు. ఓటు హక్కు ఉండి ఎన్నికల్లో పోటీచేయని యువత, ప్రజా సమస్యలపై సామాన్య పౌరుడి అభిప్రాయాలు, ఆలోచనలను వీడియోల్లో వ్యక్తపరచవలెనని తెలిపారు. ఆసక్తి గల యువత 90-120 సెంకడ్ల నిడివి గల వీడియోను రూపొందించి, యూట్యూబ్ అప్ లోడ్ చేసి ఆయా లింక్ innovative.my.gov.in/youth-parlament వెబ్ సైట్ లో పొందుపరిచి, రిజిష్టర్ చేసుకోవాలన్నారు.
గమనిక:- ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.
https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1
