Top Ad unit 728 × 90

అజారుద్దీన్ కుమారుడితో సానియా మీర్జా సోదరి నిఖా...!

అజారుద్దీన్ కుమారుడితో సానియా మీర్జా సోదరి నిఖా...!

టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు అసద్(25), ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జా(28) రిలేషన్‌లో ఉన్నారని... త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని, అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని సానియా మీర్జా కన్ఫర్మ్ చేసింది. డిసెంబర్‌లో ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సానియా తెలిపింది. పారిస్‌లో బ్యాచులర్ పార్టీని పూర్తి చేసుకొని వచ్చిన వెంటనే వీరిద్దరి వివాహం ఉండబోతుందని ఆమె పేర్కొంది.

కాగా అనమ్‌కు 2016లో అక్బర్ రషీద్‌తో వివాహం జరిగింది. ఆ తరువాత కొన్ని కారణాల వలన గతేడాది ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తన ఫ్యాషన్‌ కెరీర్‌ మీదే దృష్టిపెట్టిన అనమ్ గత కొంతకాలంగా అసద్‌తో రిలేషన్‌లో ఉంది. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ... ఇదివరకు పలుమార్లు సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేశారు. అలాగే అసద్ సైతం అనమ్‌తో తీసుకున్న ఓ ఫొటోకు ఫ్యామిలీ అనే కామెంట్ పెట్టాడు. ఇదిలా ఉంటే అసద్ ప్రస్తుతం బడ్డింగ్ లాయర్‌గా పనిచేస్తున్నాడు.

ముఖ్య గమనిక: వార్తలు, కథనాలు, భక్తి సమాచారం వ్రాయాలనుకున్తున్నారా...? మీ వివరాలను info@pslvtv.com OR pslvtv@gmail.com మెయిల్ చేయగలరు.

 

అజారుద్దీన్ కుమారుడితో సానియా మీర్జా సోదరి నిఖా...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *