Top Ad unit 728 × 90

శృంగార తారగా కనిపించబోతున్న రమ్యకృష్ణ

శృంగార తారగా కనిపించబోతున్న రమ్యకృష్ణ...!

వైవిధ్య పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన రమ్యకృష్ణ… తాజాగా శృంగార తారగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. బాహుబలి చిత్రంలో శివగామి గా ఓ పవర్ ఫుల్ రోల్ చేసి యావత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న రమ్య, ప్రస్తుతం కోలీవుడ్ తెరకెక్కుతున్న 'సూపర్ డీలక్స్' అనే చిత్రంలో నటిస్తుంది.

ఈ చిత్రంలో రమ్యకృష్ణ శృంగార తార గా నటిస్తుంది. ముందుగా ఈ పాత్రకు అత్తారింటికి దారేది ఫేమ్ నదియా ను అనుకున్నారట కానీ ఆమె నో చెప్పడం తో ఆ ఛాన్స్ రమ్య కృష్ణ దక్కినట్లు సమాచారం. 2004లో వచ్చిన సునామి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, సమంత, ఫహద్ ఫాసిల్, మిస్కీన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కుమార్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి శృంగార తారగా రమ్య ఎంత హాట్ గా కనిపిస్తుందో చూడాలి.

గమనిక:- వీడియోల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

శృంగార తారగా కనిపించబోతున్న రమ్యకృష్ణ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *