Top Ad unit 728 × 90

R R R రెండో భారీ షెడ్యూల్‌ ప్రారంభం

R R R రెండో భారీ షెడ్యూల్‌ ప్రారంభం...!

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నవంబర్‌లో మొదలైన మొదటి షెడ్యూల్‌ ఇటీవల పూర్తైంది. ఈరోజు నుంచి రెండో భారీ షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రానికి కథ అందించారు. కథానాయికల వివరాలు, ఇతర తారాగణానికి సంబంధించిన వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రానికి 'రామ రావణ రాజ్యం' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్‌ భామ అదితి రావు హైదరిని ఓ కథానాయికగా ఎంపికచేసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. సినిమా చిత్రీకరణను త్వరగా పూర్తిచేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు ఫిలిం వర్గాల సమాచారం. ఈ చిత్రం కోసం చరణ్‌, తారక్‌లను రాజమౌళి పది నెలలు సమయం అడిగినట్లు తెలుస్తోంది. ఇందుకు వారు కూడా ఒప్పుకొన్నారని, 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' పూర్తయ్యేవరకు మరో సినిమా చిత్రీకరణను మొదలుపెట్టరని టాలీవుడ్‌ టాక్‌.

గమనిక:- వీడియోల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

R R R రెండో భారీ షెడ్యూల్‌ ప్రారంభం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *