నాగచైతన్యతో శోభిత ధూళిపాళ పెళ్లి ఫిక్స్...!
నాగచైతన్యతో శోభిత ధూళిపాళ పెళ్లి ఫిక్స్...!
అక్కినేని వారి ఇంట్లో మరోసారి పెళ్లి బాజాలు మూగనున్నాయి. తాజాగా నవయువ సామ్రాట్ నాగచైతన్య అలాగే ప్రముఖ నటి మోడల్ శోభిత ధూళిపాల ఇరువురు పెళ్లి చేసుకోబోతున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా నాగచైతన్య శోభిత ధూళిపాల రిలేషన్షిప్ లో ఉన్నారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చెక్కర్లు కొడుతోంది. ఇందులో శోభిత నాగచైతన్య ఎంగేజ్మెంట్ గురువారం జరిగే అవకాశం ఉందని కొద్దిమంది అతిధుల మధ్య జరిగే ఈవెంట్ ఫోటోలు శుక్రవారం నాగర్జున స్వయంగా విడుదల చేస్తారని అలాగే పెళ్లికి సంబంధించిన వివరాలు కూడా ఆయన స్వయంగా తెలుపుతారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే నాగచైతన్య నటి సమంత కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు.
నటి శోభిత ధూళిపాళ్లది గుంటూరు జిల్లా తెనాలి. ఆమె 2013లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. అలాగే కింగ్ఫిషర్ క్యాలెండర్లో తలుక్కుమని మెరిసి మోడలింగ్ ప్రపంచంలో అడుగు పెట్టారు. 2016 వ సంవత్సరం బాలీవుడ్లో రోమన్ రాఘవ్ సినిమా ద్వారా ఆమె తెరంగేట్రం చేశారు. 2018లో అడవి శేషు నటించిన గూడచారి సినిమాలో శోభిత ధూళిపాల తళుక్కున మెరిశారు. అలాగే అడవి శేష్ నటించిన మరో చిత్రం మేజర్ లో సైతం శోభిత కనిపించారు. దీంతోపాటు ఆమె పలు వెబ్ సిరీస్ లలో ఒక సైతం నటించారు. ఆమె నటించిన మేడిన్ హెవెన్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమైంది.
Aithey Nag chaitanya cheating on sam true news anamatahttps://t.co/E2QSAZFMOo
— OldMonk (@punIntended_247) August 7, 2024