Top Ad unit 728 × 90

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' షూటింగ్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' షూటింగ్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' షూటింగ్ జరుగుతోంది. మహేశ్ బాబు 25వ సినిమాగా ఇది రూపొందుతోంది. ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా నుంచి వదులుతోన్న పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ముందే ప్రకటించారు. దాంతో ఇక త్వరలోనే టీజర్లు... ట్రైలర్లు సందడి చేస్తాయని అభిమానులు భావించారు. కానీ ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందువల్లనే కాస్త ఆలస్యంగానే టీజర్ వస్తోంది. 'మహాశివరాత్రి' సందర్భంగా మార్చి 4వ తేదీన టీజర్ ను విడుదల చేయనున్నట్టుగా సమాచారం. దాదాపు ఈ తేదీ ఖరారైపోయిందని అంటున్నారు. ఆ రోజునే టీజర్ ద్వారా సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, అల్లరి నరేశ్ ఒక ముఖ్యమైన పాత్రను చేస్తోన్న సంగతి తెలిసిందే.

గమనిక:- వీడియోల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' షూటింగ్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *