ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్... కారణం ఇదే...?
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్... కారణం ఇదే...?
మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ మాస్ మసాలా సినిమా. బాలీవుడ్ హిట్ సినిమా ‘రైడ్’ కి రీమేక్ గా వస్తోంది ఈ సినిమా.
రవితేజ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే కథానాయకాగా నటిస్తోంది. ఇటీవల వవిడుదల చేసిన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా మిస్టర్ బచ్చన్ ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్సాన్స్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేట్రికల్ ట్రైలర్ ను బుధవారం విడుదల చేస్తామని మేకర్స్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. హైదరాబాద్ ట్రిపుల్(AAA ) సినిమాస్ లో సాయంత్రం 5 గంటలకి మిస్టర్ బచ్చన్ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని ప్లాన్ చేసారు నిర్మాతలు.
ఇందుకు సంబంధించి ఎంట్రీ పాస్ లను కూడా ఫ్యాన్స్ కు ఇచ్చేసారు. కానీ ఉన్నట్టుండి ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్టు ఈవెంట్ నిర్వాహకులు వెల్లడించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈవెంట్ ని నిలిపివేసామని, దయచేసి అభిమానులు అర్ధం చేసుకోగలరు అంటూ క్షమాపణలు కోరింది సదురు సంస్థ. సినిమాకు సంబంధించి రాబోయే అప్ డేట్స్ కోసం నిర్మణాసంస్థను ఫాలో అవండి అంటూ ఓ నోట్ రిలీజ్ చేసింది. ఈవెంట్ మాత్రమే క్యాన్సిల్ అయింది, కానీ సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకి ట్రైలర్ రిలీజ్ చేయాలనీ భావిస్తోంది నిర్మాణ సంస్థ. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు.