Top Ad unit 728 × 90

డబ్బు కోసం నా తల్లి నన్ను 13 ఏళ్ల వయసులోనే..: నటి సంగీత సంచలన కామెంట్స్

డబ్బు కోసం నా తల్లి నన్ను 13 ఏళ్ల వయసులోనే..: నటి సంగీత సంచలన కామెంట్స్

సినీ నటి సంగీత కుటుంబ తగాదాలు చినికిచినికి గాలివానగా మారాయి. వృద్దురాలైన తనను ఇంట్లో నుండి గెంటేశారంటూ సంగీత తల్లి భానుమతి ఇటీవల తమిళనాడు రాష్ట్ర మహిళా విభాగంలో కూతురు సంగీతపై ఫిర్యాదు చేసింది. దీంతో సంగీత తన కన్న తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిందంటూ తమిళ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే తన తల్లి తనపై చేసిన ఆరోపణల్ని ఖండిస్తూ.. కన్నతల్లి పైనే సంచలన ఆరోపణలు చేసింది సీనియర్ హీరోయిన్ సంగీత. 

ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ సినిమాల్లోని రావాలను కునే వాళ్లు చెప్పే ఈ డైలాగ్ ‘ఖడ్గం’ చిత్రంతో బాగా పాపులర్ అయ్యింది. ఈ చిత్రంలో ఒక్క ఛాన్స్ డైలాగ్‌తో హీరోయిన్ సంగీత ఫేమస్ అయ్యింది. ఆ చిత్రం తరువాత పెళ్లాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, సంక్రాంతి తదితర విజయవంతమైన చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోయిన్‌తో పాటు గ్లామరస్ నటిగా పేరు సంపాదించి సంగీత. 

తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సంగీత 2009లో సింగర్ క్రిష్‌ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. వీరికి ఒక పాప కూడా ఉన్నారు. కాగా.. మొన్నటి వరకూ సంగీతతోనే ఉన్న ఆమె తల్లి భానుమతి సడెన్‌గా తనను ఇంట్లో నుండి తన కూతురు సంగీత గెంటేసిందంటూ మహిళా సంఘాన్ని ఆశ్రయించింది. 

దీంతో సంగీత కుటుంబ తగాదా తమిళ సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారడంతో సోషల్ మీడియా ద్వారా సంచలన విషయాలను బయటపెట్టింది నటి సంగీత. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన తల్లి భానుమతిపై సంచలన ఆరోపణలు చేసింది సంగీత. 

తన తల్లి తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని.. ఆమె తనను చాలా రకాలుగా చిత్ర హింసలకు గురిచేసిందన్నారు. 13 ఏళ్ల వయసు నుండి స్కూల్ మానిపించేసి.. డబ్బు కోసం తనను పనికి పంపిందని.. ఆ డబ్బుకు ఆశపడి తనకు పెళ్లి వయసు వచ్చినా పెళ్లి చేయడానికి ఇష్టపడలేదన్నారు. 

ప్రియమైన నా తల్లి.. నాకు జన్మ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ.. ఆడపిల్లనని చూడకుండా చిన్నప్పుడే పనికిపంపినందుకు నీకు ధన్యవాదాలు.. బ్లాంక్ చెక్కులకు ఆశపడి నన్ను డబ్బు కోసం నువ్వు నీ తాగుబోతు కొడుకులు బాగా ఉపయోగించుకున్నందుకు ధన్యవాదాలు. 

డబ్బు కోసం నువ్వు నీ కొడుకులు నన్ను ఎన్ని విధాలుగా హింసించారు. మద్యం, డ్రగ్స్‌కి బానిసలైన నీ కొడుకులకు వత్తాసు పలుకుతూ నన్ను హింసించారు. మీరు పెళ్లి చేయకపోగా.. ఇప్పుడు నాతో పాటు నా భర్తను కూడా వేధిస్తున్నారు. మాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు అందకు మీకు ధన్యవాదాలు. అయితే మీరు వేధింపుల వల్ల నేను కుంగిపోలేదు. పరిణితి చెందాను. ధీటుగా ఎదుర్కొంటాను. 

నా బాగు కోరుకునే వాళ్లందరూ ఎల్లప్పుడూ నాతో ఉంటుంన్నందుకు ధన్యవాదాలు. సినీ ప్రియులందరికీ చెప్పేది ఏంటంటే ఒక యాక్టర్ ఉండటం అనేది అంత సులభమైనది కాదు’ అంటూ ట్విట్టర్‌లో తన తల్లిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది సంగీత. 

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

డబ్బు కోసం నా తల్లి నన్ను 13 ఏళ్ల వయసులోనే..: నటి సంగీత సంచలన కామెంట్స్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *