Top Ad unit 728 × 90

ఎగిరే ముందు ...

ఎగిరే ముందు...

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అందుబాటులో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దీంతో ముందస్తు ప్రణాళిక లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఏ దేశానికి వెళ్లాలి, ఏయే యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రామాణిక పరీక్షలేవి, వాటికి ఎప్పటి నుంచి సిద్ధం కావాలి, ఎంత ఖర్చవుతుంది? ఇలాంటి విషయాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. వచ్చే ఏడాది విదేశాల్లో డిగ్రీ లేదా పీజీ చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం. అందుకే ఏయే అంశాలపై దృష్టిపెట్టాలో ఇప్పటి నుంచే తెలుసుకోవాలి. నా ణ్యమైన విద్యతోపాటు భవిష్యత్తు ఉద్యోగావకాశాలను మెరుగుపరచుకునే ఉద్దేశంతో ఎక్కువమంది విదేశీ విద్యపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో విభిన్న సంస్కృతులు, అంతర్జాతీయ ఆలోచన విధానాలపై అవగాహన ఏర్పడుతోంది. ఏ దేశంలో చదవాలి అన్నది విద్యార్థి ఆసక్తి, స్థోమత, కెరియర్‌ అవకాశాల ఆధారంగా నిర్ణయించడం మంచిది. 
మనదేశ విద్యార్థులకు ఫారిన్‌ ఎడ్యుకేషన్‌ అనగానే సాధారణంగా పీజీ గుర్తొస్తుంది. కొన్నేళ్లుగా కొందరు గ్రాడ్యుయేషన్‌పైనా దృష్టిపెడుతున్నారు. ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, డిగ్రీ తుది సంవత్సరం చదువుతున్నవారు విదేశాల్లో చదవాలని అనుకుంటే.. అందుకు సంబంధించిన విశ్వవిద్యాలయాలు, వాటి దరఖాస్తు విధానం వంటి అంశాలపై ఇప్పటి నుంచే అవగాహన ఏర్పరచుకోవడం అవసరం. అబ్రాడ్‌ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఎంతో సమాచారం ఇప్పుడు అంతర్జాలంలో అందుబాటులో ఉంది. కానీ తగిన వాటిని నిర్ణయించుకోడానికి కొన్ని అంశాలను పరిశీలించుకోవాలి.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

ఎగిరే ముందు ... Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *