గురుకుల ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల...!
గురుకుల ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల...!
తెలంగాణలోని సాంఘిక, గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు గురుకుల సొసైటీ నవంబరు 27న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదోతరగతి పరీక్షలకు హాజరయ్యేవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కోరువారు నవంబరు 28 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి డిసెంబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. సాంఘిక సంకేమశాఖ కళాశాలల్లో ప్రవేశాలకు వచ్చే ఏడాది జనవరి 5న, గిరిజన సంక్షేమ కళాశాలల్లో జనవరి 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష వివరాలు...
దరఖాస్తు చేసుకున్నవారికి లెవల్-1, లెవల్-2 స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. 160 మార్కులకు లెవల్-1 పరీక్ష, 150 మార్కులకు లెవల్-2 పరీక్ష నిర్వహిస్తారు.
సోషల్ వెల్ఫేర్ ప్రవేశాలకు జనవరి 5న లెవల్-1, ఫిబ్రవరి 9న లెవల్-2 పరీక్ష నిర్వహిస్తారు.
ట్రైబల్ వెల్ఫేర్ ప్రవేశాలకు జనవరి 12న లెవల్-1, ఫిబ్రవరి 16న లెవల్-2 పరీక్ష నిర్వహిస్తారు.
