Top Ad unit 728 × 90

కామర్స్‌లో మీ సత్తా ఎంత?

కామర్స్‌లో మీ సత్తా ఎంత?

కామర్స్‌లో తమ సత్తా చాటాలనుకునేవారికి ఓ మంచి అవకాశం. ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) టాలెంట్‌ టెస్ట్‌ ద్వారా ఆ అవకాశాన్ని కల్పిస్తోంది. స్కూలు స్థాయి నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ చేస్తున్నవారెవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన విడుదలైంది.

ఐ సీఏఐ- కెరియర్‌ కౌన్సెలింగ్‌ గ్రూపు (సీసీజీ) ఐసీఏఐ కామర్స్‌ విజర్డ్‌- 2019 పేరుతో ఈ టాలెంట్‌ టెస్ట్‌ను నిర్వహిస్తోంది. కామర్స్‌ విద్యకు ప్రాచుర్యం కల్పించడం, విద్యార్థిలోని కాన్సెప్టు అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని అంచనా వేయడం ఈ టెస్ట్‌ ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా విద్యార్థికి సబ్జెక్టు ఎంతవరకూ తెలుసో కాకుండా ఒక్కో కాన్సెప్టును ఏమేరకు అర్థం చేసుకున్నాడో పరీక్షిస్తారు. 
తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులు, బీకాం, బీబీఏ, బీఎంఎస్‌, సంబంధిత విభాగానికి చెందిన అభ్యర్థులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దూరవిద్యను అభ్యసించేవారూ అర్హులే.

* రెండు దశలు 
రెండు దశల్లో విద్యార్థిని పరీక్షిస్తారు. రెండూ ఆన్‌లైన్‌ విధానంలోనే ఉంటాయి. లెవల్‌-1ను విద్యార్థి తమ ల్యాప్‌టాప్‌/ డెస్క్‌టాప్‌ ద్వారా నచ్చిన ప్రదేశంలో పరీక్ష నిర్వాహకుల నిబంధనల మేరకు రాయాల్సి ఉంటుంది. సిస్టమ్‌కు సంబంధించి కొన్ని ప్రమాణాలు (ఓఎస్‌, ప్రాసెసర్‌, ర్యామ్‌, బ్రౌజర్‌, ఇంటర్నెట్‌ స్పీడ్‌లకు సంబంధించినవి) ఉండటం తప్పనిసరి. దీనిలో ఎంపికైన వారికి లెవల్‌-2 నిర్వహిస్తారు. లెవల్‌-1లో ప్రతి తరగతి నుంచి 800 మందిని లేదా హాజరైనవారిలో 10% మందిని లెవల్‌-2కు ఎంపిక చేస్తారు. లెవల్‌-2 కూడా ఆన్‌లైన్‌ పరీక్షే. దీనిని సంస్థ కొన్ని టెస్ట్‌ సెంటర్లలో నిర్వహిస్తుంది. పరీక్ష ఆంగ్లంలోనే ఉంటుంది. సీబీఎస్‌ఈ/ ఐసీఎస్‌ఈ, నేషనల్‌, స్టేట్‌ బోర్డులు, సెకండరీ, సీనియర్‌ సెకండరీ పరీక్షలకు సరిపోయేలా ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. 100 ప్రశ్నలకు 75 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. 
లెవల్‌-1లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పార్టిసిపెంట్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. లెవల్‌-2లో ప్రథమ ర్యాంకు సాధించిన వారికి రూ.లక్ష, ద్వితీయ ర్యాంకు వారికి రూ.50,000, మూడో బహుమతిగా రూ.25,000 ఇస్తారు. వీటిని తొమ్మిది, పది, ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలవారు, డిగ్రీ (బీకాం/బీబీఏ /బీఎంఎస్‌/ సంబంధిత విభాగాలు) వారికి విడివిడిగా అందజేస్తారు. టాప్‌ 200 మందికి సర్టిఫికెట్‌తోపాటు రూ.500 చొప్పున కన్సొలేషన్‌ బహుమతులుంటాయి. వీరిని కూడా ప్రతి తరగతి నుంచీ ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం 
ఆ న్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100. విద్యార్థి సొంతంగా అయినా, విద్యా సంస్థ తరఫున అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. 
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: డిసెంబరు 24, 2019 లెవల్‌-1 పరీక్ష తేదీ: జనవరి 5, 2020 (తరగతులను బట్టి పరీక్ష సమయాల్లో తేడాలుంటాయి) 
లెవల్‌-2 పరీక్ష తేదీ: జనవరి 19, 2020 http://icaicommercewizard.org/

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

కామర్స్‌లో మీ సత్తా ఎంత? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *