Top Ad unit 728 × 90

అవుతారా... ఆర్మీ స్కూల్‌ టీచర్‌!

అవుతారా... ఆర్మీ స్కూల్‌ టీచర్‌!

దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ స్కూళ్లలో ఈ విద్యా సంవత్సరానికి దాదాపు 8 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ జరగనుంది. పాఠశాలలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. వీటికి దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు ముందుగా ఒక కామన్‌ పరీక్షలో అర్హత సాధించాలి. ఆ పరీక్షకు ప్రకటన వెలువడింది.

దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి తొలిదశ ప్రక్రియ ప్రారంభమైంది. సుమారుగా 8 వేల పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ ఖాళీలున్నట్లు అంచనా వేశారు. దరఖాస్తుదారులకు మొదట స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహిస్తారు. అర్హత సాధించినవారికి స్కోరుతో కూడిన కార్డులు లేదా పత్రాలు అందజేస్తారు. సైనిక పాఠశాలలు విడివిడిగా ఇచ్చే ఉద్యోగ భర్తీ ప్రకటనలకు కామన్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్కూళ్ల ప్రకటనలకు అప్లై చేసుకున్నవారికి రెండో, మూడో దశలైన మౌఖిక పరీక్ష, టీచింగ్‌ స్కిల్స్‌- కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీల్లో పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడతారు.
తొలి దశ ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ పరీక్షకు దరఖాస్తు చేయాలంటే ఏప్రిల్‌ 1, 2020 నాటికి 40 ఏళ్లలోపు ఉండాలి. బోధనలో అయిదేళ్లు అనుభవం ఉంటే 57 సంవత్సరాలలోపు వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతల వివరాలు...

పీజీటీ: పీజీ, బీఎడ్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
టీజీటీ: గ్రాడ్యుయేషన్‌, బీఎడ్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
పీఆర్‌టీ: గ్రాడ్యుయేషన్‌, బీఎడ్‌ లేదా రెండేళ్ల డిప్లొమాలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత అవసరం.
తొలిదశ ఆన్‌లైన్‌ పరీక్షకు హాజరు కావడానికి సీటెట్‌ లేదా టెట్‌లో అర్హత సాధించాల్సిన అవసరం లేదు. కానీ టీజీటీ, పీఆర్‌టీ పోస్టుల అపాయింట్‌మెంట్‌ సమయానికి సీటెట్‌ లేదా టెట్‌లో అర్హత పొంది ఉండాలి. అప్పటికీ అర్హత సాధించకపోతే తాత్కాలిక ప్రాతిపదికన నియామకం జరుగుతుంది. సీటెట్‌ లేదా టెట్‌లో అర్హత సాధించిన తర్వాత పూర్తిస్థాయి నియామకం నిర్వహిస్తారు.

ఎంపిక ఎలా?
మొదటి దశలో అందరికీ ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఈ స్క్రీనింగ్‌లో అర్హత సాధించినవారు ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడితే అప్లై చేసుకోవాలి. తర్వాత రెండు, మూడు దశల పరీక్షలు జరుపుతారు. రెండో దశలో ముఖాముఖి ఉంటుంది. మూడో దశలో టీచింగ్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీపై పరీక్ష జరుపుతారు. వీటిని సెలక్షన్‌ కమిటీ పరిశీలిస్తుంది. భాషా సంబంధ ఉపాధ్యాయులకైతే ఎస్సే, కాంప్రహెన్షన్‌ పరీక్ష ఉంటుంది. దీనికి 15 మార్కులు కేటాయించారు.
టీజీటీ, పీజీటీ పోస్టులకు స్క్రీనింగ్‌పరీక్ష 180 మార్కులకు ఉంటుంది. కాలవ్యవధి 3 గంటలు. పార్ట్‌- ఎలో జనరల్‌ అవేర్‌నెస్‌, మెంటల్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, ఎడ్యుకేషన్‌ కాన్సెప్టులు, మెథడాలజీ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటికి 90 మార్కులు. పార్ట్‌- బి సబ్జెక్టుకు సంబంధించి ఉంటుంది. ఈ విభాగానికీ 90 మార్కులు కేటాయించారు. రెండు విభాగాల్లో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి. పీఆర్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి పార్ట్‌-ఎలో మాత్రమే పరీక్ష ఉంటుంది. వ్యవధి 90 నిమిషాలు. మార్కులు 90. రుణాత్మక మార్కులున్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: సెప్టెంబరు 21 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.
స్క్రీనింగ్‌ పరీక్ష: అక్టోబరు 19, 20.
ఫలితాలు: అక్టోబరు 30న.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, సికింద్రాబాద్‌.
వెబ్‌సైట్‌: http://aps-csb.in

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

అవుతారా... ఆర్మీ స్కూల్‌ టీచర్‌! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *