Top Ad unit 728 × 90

జూన్‌ 17 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ

జూన్‌ 17 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ

అమరావతి: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 17 నుంచి 29 వరకు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు అతి తక్కువ వ్యవధిలో నిర్వహించవలసి ఉన్నందున విద్యార్థులు రీకౌంటింగ్‌ మార్కుల ఫలితాల కోసం ఎదురు చూడకుండా, మార్చి 2019లో ఫెయిలైన వారందరూ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని జారవిడుచుకోకూడదని పాఠశాల విద్యా కమిషనర్‌ కె.సంధ్యారాణి సూచించారు.

సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ ఇలా..

  • విద్యార్థులు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు జూన్‌ 6వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలి.
  • సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఖజానా కార్యాలయాలు లేదా ఎస్‌బీహెచ్‌ లేదా ఎస్‌బీఐ బ్యాంక్‌ల్లో జూన్‌ 7లోగా చెల్లించాలి.
  • సంబంధిత ప్రధానోపాధ్యాయులు కంప్యూటర్‌ ముద్రిత ఎన్‌ఆర్‌లతో సహా సహా డీఈఓ కార్యాలయాల్లో జూన్‌ 8లోగా సమర్పించాలి.
  • డీఈఓలతో ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయానికి ముద్రితమైన ఎన్‌ఆర్‌లను జూన్‌ 10లోగా సమర్పించాలి.

పది పరీక్షలు రాసిన విద్యార్థులకు సమాచారం...

  • మార్కుల జాబితాను రెండు రోజుల్లో www.bseap.org వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. ఈ మార్కుల జాబితా పరీక్ష ఉత్తీర్ణులైన విద్యార్థులకు జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఉపయోగపడతాయి. విద్యార్థుల పాస్‌ సర్టిఫికెట్లను సంబంధిత పాఠశాలలకు త్వరలో పంపిస్తారు.
  • పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల నామినల్‌ రోల్‌ పట్టికను www.bseap.org వెబ్‌సైట్‌ నుంచి ఈ నెల 25 నుంచి పొందవచ్చు.
  • పాఠశాలల నుంచి, సంబంధిత కేంద్రాల నుంచి కొంత సమాచారం రావలసినందున కొందరి విద్యార్థుల ఫలితాలు విత్‌ హెల్డ్‌లో ఉంచారు. వీరి ఫలితాలు త్వరలోనే ప్రకటిస్తారు.

రీకౌంటింగ్‌ ఫీజు గడువు 30

  • మార్కులు తిరిగి లెక్కింపు కోరే విద్యార్థులు సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఈ నెల 30లోగా సీఎఫ్‌ఎంఎస్‌ చలానా ద్వారా చెల్లించాలి. డీడీ/బ్యాంకర్స్‌ చెక్కులు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు.
  • ఈ సంవత్సరం కూడా సమాధాన పత్రాల పునఃపరిశీలనా విధానాన్ని అన్ని జిల్లా కేంద్రాలకు వికేంద్రీకరించారు. అభ్యర్థులు పూర్తిచేసిన ఫారాలను సంబంధిత హెడ్మాస్టర్‌తో ధ్రు వీకరణ సంతకం చేయించి, హాల్‌టికెట్‌ జిరాక్స్‌తో పాటుగా డీఈఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కౌం టర్‌లో ఈ నెల 30లోగా సమర్పించా లి. దరఖాస్తు ఫారం నమూనాను www.bseap.org వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లేదా సం బంధిత డీఈఓ కార్యాలయం నుంచి పొందవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా వ్యక్తిగతంగా చెల్లించాలి.

ఆందోళన వద్దు... పదో తరగతి పరీక్షా ఫలితాలపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యార్థులు ధైర్యంగా ఉండాలని పాఠశాల విద్యా కమిషనర్‌ కె.సంధ్యారాణి అన్నారు. మంగళవారం 'పది' పరీక్ష ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'మార్కులు/ఫలితం ఆశించిన విధంగా లేదని ఏ ఒక్కరూ కూడా అఘాయిత్యానికి పాల్పడవద్దు. సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం ఉందన్నారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

జూన్‌ 17 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *