Top Ad unit 728 × 90

‘పది’ వాల్యూయేషన్‌ సాగేదెలా?

‘పది’ వాల్యూయేషన్‌  సాగేదెలా?

హైదరాబాద్‌: పదో తరగతి స్పాట్‌ వాల్యుయేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలు.. ఈ రెండింటిలోనూ ఉపాధ్యాయులే కీలకం. వీరి సేవలు వినియోగించుకోకుండా అటు వాల్యుయేషన్‌, ఇటు ఎన్నికలను పూర్తిచేయలేం. అలాంటిది ఇప్పుడు ఈ రెండు ఒకే సమయంలో వచ్చాయి. దీంతో రెండు విధుల్లో ఒకేసారి ఎలా పాల్గొనాలనే సందిగ్ధంలో ఉపాధ్యాయులు పడిపోయారు. ఒకవేళ పది మూల్యాంకనం వాయిదా వేద్దామంటే అది కుదిరే పని కాదు. సకాలంలో ఫలితాలు వెల్లడించకపోతే విద్యార్థుల కెరీర్‌పై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ సంకట పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ ఎలా పరిష్కరిస్తుందోనని ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఈ నెల 22 నుంచి జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఈనెల 15 నుంచే పదో తరగతి పరీక్షల మూల్యాంకనం జరగబోతోంది. రాష్ట్రంలోని స్కూల్‌ అసిస్టెంట్లే ఈ మూల్యాంకన విధుల్లో పాల్గొంటారు.

ఇందుకోసం ఈనెల 15 నుంచే ఎన్నికల శిక్షణ ప్రారంభం కాబోతుంది. మూల్యాంకనంలో పాల్గొనే ఉపాధ్యాయులు కూడా శిక్షణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఒక పక్క ఎన్నికల శిక్షణకు హాజరవుతూనే టెన్త్‌ వాల్యుయేషన్‌ విధులు ఎలా నిర్వర్తించాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఎన్నికల శిక్షణ ఉన్న రోజు ఉపాధ్యాయులకు పదో తరగతి మూల్యాంకనం విధుల నుంచి మినహాయింపు ఉంటుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అటు ప్రభుత్వం నుంచి గాని, ఇటు ఎన్నికల కమిషన్‌ నుంచి గాని ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

‘పది’ వాల్యూయేషన్‌ సాగేదెలా? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *